ఏపీలో జనసేన పార్టీ( Janasena ) ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందనే ప్రశ్న అభిమానులకు భేతాళ ప్రశ్నలా ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఆ ప్రశ్నకు తాజాగా క్లారిటీ వచ్చేసింది.24 ఎమ్మెల్యే స్థానాలలో 3 ఎంపీ స్థానాలలో జనసేన పోటీ చేస్తున్నట్టు అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.అయితే జనసేన తక్కువ స్థానాలలో పోటీ చేయడం గురించి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారనే సంగతి తెలిసిందే.
అయితే ఆ అసంతృప్తికి చెక్ పెట్టేలా తక్కువ స్థానాలలో పోటీ చేయడం గురించి పవన్ క్లారిటీ ఇచ్చారు.జగన్( Jagan ) సిద్ధం అని చెబుతుండటంతో తాము సైతం సంసిద్ధం అని చెబుతున్నామని పవన్ చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలనే తమ పోరాటమని ఆయన కామెంట్లు చేశారు.తనతో చాలామంది పెద్దలు 70 స్థానాలలో పోటీ చేయాలని సూచనలు చేశారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
గత ఎన్నికలలో 10 స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులు గెలిచి ఉంటే ఎక్కువ సంఖ్యలో స్థానాలను అడిగి ఉండేవాడినని పవన్ కామెంట్లు చేశారు.తక్కువ సంఖ్యలో సీట్లలో పోటీ చేసి ఎక్కువ స్థానాలలో ఎక్కువ స్ట్రైక్ రేట్ తో విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.బీజేపీకి( BJP ) సీట్లు ఇచ్చే క్రమంలో తమ పార్టీ సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
బీజేపీతో చర్చలు తుది రూపు దిద్దుకున్న తర్వాత మిగతా సీట్లకు సంబంధించి క్లారిటీ వస్తుందని పవన్ పేర్కొన్నారు.ఏపీ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయాలను తీసుకున్నామని ఆయన వెల్లడించారు.పవన్ కళ్యాణ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జనసేన పోటీ చేసే 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను పవన్ ప్రకటించారు.అయితే వైసీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటం గమనార్హం.