Aadikeshava : థియేటర్లలో డిజాస్టర్.. బుల్లితెరపై బ్లాక్ బస్టర్.. మెగా హీరో బుల్లితెరపై సత్తా చాటాడుగా!

సాధారణంగా థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమాలు బుల్లితెరపై అంతకు మించి డిజాస్టర్లు అవుతుంటాయి.ఒకవేళ బుల్లితెరపై మంచి రేటింగ్ వచ్చినా మరీ అద్భుతమైన రేటింగ్ అయితే రాదు.

 Aadikeshava Movie Trp Rating Details Here Goes Viral-TeluguStop.com

అయితే ఆదికేశవ సినిమా( Aadikeshava ) మాత్రం బుల్లితెరపై రేటింగ్ విషయంలో అదరగొట్టింది.పెద్ద సినిమాలకు సైతం సాధ్యం కాని స్థాయిలో ఈ సినిమా రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.ఈ సినిమాకు బుల్లితెరపై ఏకంగా 10.29 అర్బన్ రేటింగ్ వచ్చింది.

Telugu Aadikeshava, Sreeleela, Tollywood, Vaishnav Tej-Movie

అల్ట్రా డిజాస్టర్ మూవీకి అదిరిపోయే రేటింగ్ రావడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.స్టార్స్ కు సైతం సాధ్యం కానిది వైష్ణవ్ తేజ్ కు సాధ్యమైందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ఉప్పెన తర్వాత సరైన హిట్ లేని వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) కు ఈ సినిమా రేటింగ్ ఊరటనిస్తుందనే చెప్పాలి.వైష్ణవ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావలసి ఉంది.

Telugu Aadikeshava, Sreeleela, Tollywood, Vaishnav Tej-Movie

మెగా బ్యాగ్రౌండ్ ఉన్నా సరైన కథలను ఎంపిక చేసుకోకపోవడం వైష్ణవ్ తేజ్ కు మైనస్ అవుతోంది.వైష్ణవ్ తేజ్ పారితోషికం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.సాయితేజ్, వైష్ణవ్ తేజ్ కలిసి నటిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.శ్రీలీల కెరీర్ సైతం ప్రస్తుతం ఆశించిన విధంగా లేదనే సంగతి తెలిసిందే.శ్రీలీల పారితోషికం( Sreeleela ) కూడా గతంతో పోలిస్తే తగ్గింది.ఆదికేశవ సినిమాకు క్రిటిక్స్ నుంచి మరీ దారుణమైన రివ్యూలు రాగా ఆ రివ్యూలు సైతం ఈ సినిమాపై ఎంతో ప్రభావం చూపాయి.

వైష్ణవ్ తేజ్ కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది.వైష్ణవ్ తేజ్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సత్తా చాటాలని మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube