Soybean : సోయా బీన్ చిక్కుడు సాగులో అధిక దిగుబడులు ఇచ్చే మేలు రకం విత్తనాలు ఇవే..!

రైతులు ఏ పంటలు సాగుచేసిన అధిక దిగుబడులు( High yields ) సాధించాలంటే నేల, ఎరువులతో పాటు విత్తనాలు అత్యంత కీలకము.మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

 These Are The Best Type Of Seeds That Give High Yields In The Cultivation Of So-TeluguStop.com

సోయాబీన్ చిక్కుడు( Soybean ) సాగులో సరైన మెళుకువలు, విత్తనాల ఎంపికలు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.జె.ఎస్335 రకం ఈ రకం విత్తనాలను సాగు చేస్తే, పంట 90 రోజులకు చేతికి వస్తుంది.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 10 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.

ఈ రకానికి చెందిన గింజ మద్యస్థంగా ఉంటుంది.ఈ రకం మొవ్వ కుళ్ళు తెగులను తట్టుకొని మంచి దిగుబడి ఇస్తుంది.

ఎల్.ఎల్.బి.1 రకం:

ఈ రకం విత్తనాలను సాగు చేస్తే, 65 రోజులకే పంట చేతికి వస్తుంది.ఒక ఎకరం పొలంలో 6 క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుంది.ఈ రకానికి చెందిన మొక్కలు పొట్టిగా ఉంటాయి.పత్తి, కంది( Cotton ) లాంటి పంటలలో ఈ రకాన్ని అంతర పంటగా సాగు చేయవచ్చు.

పి.కె1029 రకం:

ఈ రకం విత్తనాలను సాగు చేస్తే పంట 100 నుండి 110 రోజులలో చేతికి వస్తుంది.ఒక ఎకరం పొలంలో 8 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.

ఈ రకం త్రుప్పు తెగులను తట్టుకోగలదు.

జె.యస్ 93-05 రకం:

ఈ రకం విత్తనాలను సాగు చేస్తే పంట 90 రోజులకు చేతికి వస్తుంది.ఒక ఎకరంలో ఏడు క్వింటాళ్లకు పైగా దిగుబడి పొందవచ్చు.

యల్.యన్.బి.18 రకం:

ఈ రకం విత్తనాలను సాగు చేస్తే పంట 110 రోజులకు చేతికి వస్తుంది.ఒక ఎకరం పొలంలో 12 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.ఈ రకం ఆకు మచ్చ, తుప్పు తెగుళ్ళను, మొజాయిక్ తెగులను తట్టుకోగలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube