టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుమ కనకాల ( Suma Kanakala ) ఒకరు.సుమ వెండి తెరపై యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.
ఒకానొక సమయంలో సుమ పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసేవారు కానీ ఇటీవల కాలంలో ఈమె ఒక షో మినహా మిగిలిన ఏ ఛానల్లో కూడా బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడం లేదు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి సుమ సినిమా వేడుకలలో మాత్రం ఎంతో బిజీగా గడుపుతున్నారు.అయితే ఈమెకు బుల్లితెర కార్యక్రమాలు దూరం అవడం గురించి తాజాగా తన భర్త రాజీవ్( Rajeev Kanakala ) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సుమ నా జీవితంలోకి వచ్చిన తర్వాత మేము ఆర్థికంగా కూడా మంచిగా ఎదిగామని తెలిపారు.
మా నాన్న చేసిన అప్పులను మేమిద్దరం కష్టపడి తీర్చడమే కాకుండా ఆస్తులు సంపాదించే స్థాయికి వెళ్ళామని తెలిపారు.

ఇక సుమ కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలను మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని 6 గంటలకల్లా ఇంటికి వచ్చేదని ఒకవేళ రానిపక్షంలో పిల్లలని కూడా తన వెంటే తీసుకు వెళ్లేదని ఈయన తెలిపారు.పిల్లల్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేయలేదని రాజీవ్ తెలిపారు.ఇకపోతే ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలు పూర్తిగా తగ్గించేశారు.
ఇలా తగ్గిపోవడానికి కారణం పిల్లలేనని తెలిపారు.మావి గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు.
అందుకే సుమ పిల్లలతో కలిసి యూట్యూబ్ ఛానల్ ( Youtube channel ) ప్రారంభించారు.ఇలా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం వల్లే ఎక్కువ షోస్ చేయలేకపోతున్నారు అంటూ రాజీవ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.