దర్శకుడు సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వం వహించిన సినిమా యానిమల్.( Animal ) సినిమాలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో రన్బీర్ కపూర్ పోషించిన విజయ్ అనే పాత్ర విషపూరితమైన పురుషత్వాన్ని ప్రేరేపిస్తోంది అంటూ చాలా విమర్శలు వచ్చాయి.రచయిత జావేద్ అక్తర్( Javed Akhtar ) సైతం ఇలాంటి సినిమాలను ప్రమాదకరం అని అన్నారు.
అయితే తాజాగా ఈ కామెంట్స్ మీద సందీప్ ప్రతిస్పందిస్తూ.అక్తర్ తన సినిమాపై వేళ్లు చూపించే ముందు తన కొడుకు ఫర్హాన్ అక్తర్( Farhan Akhtar ) చేసే కంటెంట్ ను కూడా పర్యవేక్షించాలని కోరారు.

తాజాగా సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.ఆయన సినిమా చూడలేదని చాలా స్పష్టంగా ఉంది.ఆ కామెంట్‌లో తను సినిమా మొత్తం చూడలేదని చాలా క్లియర్‌గా ఉంది.ఇప్పుడు ఎవరైనా సినిమా చూడకుండా మాట్లాడితే వారి గురించి ఏం చెప్పాలి? ఆయన సినిమా చూడలేదు, ఆయన మాత్రమే కాదు, ఒక కళాఖండంపై రాళ్ళు విసురుతున్న ఎవరైనా, వారు ముందుగా తమ పరిసరాలను ఎందుకు తనిఖీ చేసుకోరు అని సందీప్ ప్రశ్నించాడు.మీర్జాపూర్‌ని( Mirzapur ) నిర్మిస్తున్నప్పుడు అదే విషయాన్ని తన కుమారుడు ఫర్హాన్ అక్తర్‌కి ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్నించారు సందీప్ రెడ్డి.ప్రపంచంలో ఉన్న బూతులు అన్నీ మీర్జాపూర్ లోనే ఉన్నాయి, ఆ దెబ్బకు నేను మొత్తం షో కూడా చూడలేదు.

ఆ షో తెలుగులోకి అనువదించబడినప్పుడు, మీరు దానిని చూస్తుంటే, మీకు బూతులతో పుక్కిలించినట్లు అనిపిస్తుంది.అతను తన కొడుకు పనిని ఎందుకు చెక్ చేయడం లేదు? అంటూ సందీప్ ప్రశ్నించారు.ఈ సందర్భంగా సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఇటీవల జావేద్ అక్తర్ ఇటీవల యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ.
ఒక పురుషుడు స్త్రీని తన షూ నాకమని లేదా ఒక వ్యక్తి స్త్రీని చెంపదెబ్బ కొట్టడానికి ఓకే చెప్పినా ఆ సినిమా సూపర్ హిట్ అయితే అది ప్రమాదకరం అని అన్నారు.ఆ వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తాజాగా సందీప్ రెడ్డి ఈ విధంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.