హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( HMDA Former Director Shiva Balakrishna ) కేసులో ఏసీబీ అధికారుల( ACB Officials ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఆయనను ఏసీబీ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు.
ఇప్పటికే శివబాలకృష్ణను మూడు రోజులపాటు విచారించిన అధికారులు బ్యాంకు లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు, నగదును గుర్తించారు.ఈ నేపథ్యంలో ఇవాళ కస్టడీలో భాగంగా బినామీ, కంపెనీ డాక్యుమెంట్లపై ఏసీబీ అధికారులు ఆరా తీయనున్నారని తెలుస్తోంది.
అయితే ఆదాయానికి మించి ఆక్రమాస్తుల కేసు( Illegal Assets )లో ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.