నటి శ్రీవిద్య( Actress Srividya ) కమల్ హాసన్ తో ప్రేమలో పడి చాలా ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు.అయితే శ్రీవిద్య కమల్ కన్నా ఒక ఏడాది పెద్దది మరియు అదే టైం లో వీరు చాలా సినిమాల్లో నటిస్తూ ఎదుగుతున్నారు.
ఆ టైంలో వారి పెళ్లి మంచి విషయం కాదు అని శ్రీవిద్య తల్లి ప్రముఖ సంగీత విద్వాంసురాలు అయిన వసంత కుమారి ఒప్పుకోలేదు.దాంతో వారి ప్రేమ పెళ్లి గా మారలేదు.

ఇక కొన్నాళ్ల తర్వాత శ్రీవిద్య అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న జార్జ్ థామస్ ( George Thomas )అనే వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత కమల్ హాసన్( Kamal Haasan ) కూడా పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నాడు.బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన శ్రీవిద్య సిరియన్ క్రిస్టియన్ అయినా జార్జ్ తో పెళ్లి చేసుకోవాలను కోవడం ఆమె తల్లికి నచ్చలేదు దాంతో ఆమె కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.

శ్రీవిద్య తన బాధలను ఎప్పుడూ ఎవరితో చెప్పుకోవడానికి ఇష్టపడేది కాదు జార్జ్తో తన వివాహ బంధం సరిగా లేదు అనే విషయాన్ని దాదాపు దశాబ్ద కాలం పాటు దాల్చింది కానీ ఈ కుటుంబానికి ఎలాగోలా విషయం తెలిసిపోయింది ఒకసారి శ్రీవిద్య ఆతన అన్న భార్యతో కూర్చున్న సమయంలో నీ జుట్టు చాలా బాగుంది అని అనగా తలరాత బాలేనప్పుడు జుట్టు బాగుంటే మాత్రం ఏ లాభం అంటూ అవేదనతో చెప్పిందట.ఆ ఒక్క మాటతో ఎంత వేదన పడుతుందో లో కుటుంబానికి అర్థం అయింది.దాంతో వసంత కుమారి ( Vasantha Kumari )ఆమె కూతురు అల్లుడితో గొడవపడి శ్రీవిద్యను ఇంటికి తీసుకెళ్ళిపోయింది.

జార్జ్ శ్రీ విద్య తో ఉంటూనే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లలను కూడా కన్నాడు.దాంతో శ్రీవిద్య విడాకులకు అప్లై చేసిన క్రిస్టియన్ పద్ధతిలో వివాహం జరిగింది కాబట్టి విడాకులకు చాలా సమయం పట్టింది ఈ మధ్యలో ఆమె అనుభవించిన నరక వేతన అంతా కాదు.దాంతో ఓసారి ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించింది.
ఆ తర్వాత క్యాన్సర్ తో కూడా మరణించిన విషయం మనందరికీ తెలిసిందే.కానీ ఆమె చివరి వరకు కుటుంబంతో విడిగానే ఉంది.
అందుకే ఆమె ఆస్తి అలాగే ఆమెకు సంబంధించిన వస్తువులు ఏవి శ్రీవిద్య కుటుంబానికి చెందలేదు.