టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నారు బన్నీ.అంతేకాకుండా ఈ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇకపోతే బన్నీ భార్య స్నేహారెడ్డి( Snehareddy ) గురించి కూడా మనందరికీ తెలిసిందే.ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా బన్నీకి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అదేమిటంటే.అల్లు అర్జున్ కి ఆయన భార్య స్నేహ రెడ్డి ఓ కండిషన్ పెట్టిందట.
ఇదే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది.అల్లు అర్జున్ మాములుగా ఎంతోమంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు.
టాప్ హీరోయిన్స్ తో అల్లు అర్జున్ డాన్సులు వేసాడు.
అయితే ప్రస్తుతం పుష్ప ద రూల్ లో శ్రీవల్లి రష్మిక మందన్నతో నటిస్తున్నాడు.పుష్ప తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తోనూ, సందీప్ వంగతోనూ కమిట్ అయ్యారు.ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న అల్లు అర్జున్ తదుపరి మూవీని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది.
అయితే బన్నీ ఇదివరకే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాలు చేసాడు.మూడు హ్యాట్రిక్ హిట్స్.ఇక ఇప్పుడు త్రివిక్రమ్ తో చెయ్యబోయే సినిమాలో అల్లు అర్జున్ యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి( Tripti Dimri ) తో రొమాన్స్ చెయ్యబోతున్నాడంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది.యానిమల్ లో బోల్డ్ గా రెచ్చిపోయిన త్రిప్తి డిమ్రిపై ఇప్పటికే టాలీవుడ్ హీరోలు కన్నేసారు.
త్రిప్తి డిమ్రి తో అల్లు అర్జున్ ని నటించవద్దు.మిగతా ఏ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసినా ఓకె అని అల్లు అర్జున్ భార్య స్నేహ భర్త కి కండిషన్ పెట్టిందట.మరి నిజంగా ఇది వినడానికి సిల్లీగానే అనిపిస్తుంది కదా.సిల్లీ కాక మరేమిటండి అల్లు అర్జున్ నికి స్నేహ కండిషన్ పెట్టడమేమిటి అంటూ అల్లు ఫాన్స్ కూడా సిల్లీగా నవ్వుకుంటున్నారు.ఈ వార్తల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వార్తపై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.