ఇదేందయ్యా ఇది.. లేటు వయసులో 8వ పెళ్లికి సిద్ధమైన 112 ఏళ్ల బామ్మ..

సాధారణంగా మహిళలు జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటారు.కొందరి జీవితంలో మాత్రం ఫస్ట్ మ్యారేజ్ కలిసి రాదు.

 This Is It 112-year-old Grandmother Who Is Ready For Her 8th Marriage At A Late-TeluguStop.com

దీనివల్ల మరో పెళ్లి చేసుకుంటారు.ఇండియాలో ఫస్ట్ పెళ్లి తర్వాత సెకండ్, థర్డ్ మ్యారేజ్‌లు చాలా తక్కువగా జరుగుతుంటాయి.

విదేశాల్లో మాత్రం సింగిల్ మ్యారేజ్ తో జీవితాన్ని గడిపేసే వాళ్ళు తక్కువ మందే ఉంటారు.మలేషియా( Malaysia )కి చెందిన ఒక బామ్మ ఏకంగా ఏడు పెళ్లిళ్లు చేసుకుంది.

ఇప్పుడు ఆమె వయసు 112 ఏళ్లు, ఇప్పుడు ఛాన్స్ వస్తే ఆ వయసులోనూ ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అని చెబుతోంది.

Telugu Healthy Active, Japan, Malaysia, Siti Hawa-Latest News - Telugu

వివరాల్లోకి వెళితే, మేడమ్ సితి హవా (112)( Siti Hawa ) అనే మలేషియన్‌ వృద్ధురాలకు ఐదుగురు పిల్లలు ఉన్నారు.19 మంది మనుమళ్లు, 30 మంది మనవరాళ్లు ఉన్నారు.ఆమెకు ఇంత‌కు ముందు ఏడు పెళ్లిళ్లు చేసుకుంది.

ఎవరైనా అడిగితే మళ్లీ పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధమని చెప్పి షాక్ ఇచ్చింది.హవా 100 ఏళ్లు దాటినా చాలా ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుంది.

నడవడానికి లేదా ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు ఆమెకు ఎవరి సహాయం కోరదు.ముస్లింగా రోజుకు ఐదుసార్లు నమాజు చేస్తుంది.

ఆమె సోదరులు, సోదరీమణులు, స్నేహితులు చాలా మంది మరణించారు.కానీ ఆమె మాత్రం ఇంకా బతికే ఉంది, ఈ నిజం ఆమెను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుందట.

Telugu Healthy Active, Japan, Malaysia, Siti Hawa-Latest News - Telugu

ఆమె తన గత భర్తలను కూడా గుర్తుచేసుకుంది.వారిలో కొందరు చనిపోయారని, మరికొందరు తమ మధ్య సరిగా కుదరకపోవడంతో విడాకులు తీసుకున్నారని చెప్పింది.హవా కోడలు వయసు 47 ఏళ్లు.హవాతో జీవించడం చాలా సులభం అని ఆమె చెప్పింది, కానీ కొన్నిసార్లు ఆమె విషయాలను మరచిపోతుందట.వృద్ధులకు ఇది సాధారణం.హవా తనంతట తానుగా తినగలదు, కానీ ఆమె టాయిలెట్‌కు వెళ్లినప్పుడు ఇబ్బంది పడుతుంది.

హవా చిన్న కొడుకు వయసు 58 ఏళ్లు.రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్( Japan ) మలేషియాను పాలించినట్లుగా గతంలోని అనేక విషయాలను హవా గుర్తుంచుకుందని ఆయన చెప్పారు.

మొత్తం మీద 112 ఏళ్ల బామ్మ ఇంటర్నెట్‌ సెన్సేషన్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube