నాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం హాయ్ నాన్న(Hi Nanna) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా నాని వరుస ఇంటర్వ్యూలకు హాజరు కావడం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించడం వంటి పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నాని ఈ సినిమా ప్రమోషన్ల స్పీడ్ పెంచారని చెప్పాలి.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాని అభిమానులతో సరదాగా ముచ్చటించారు.వారు అడిగే ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు చెప్పారు.అయితే ఒక అభిమాని మాత్రం తెలంగాణ ఎన్నికల( Telangana Elections ) గురించి నానిని ప్రశ్నించారు.మీరు ఈసారి తెలంగాణ ఎన్నికలలో ఓటు వేశారు కదా మరి కాంగ్రెస్ (Congress) విజయంపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు నాని ఫన్నీ సమాధానం చెప్పారు.గత పది సంవత్సరాలుగా మనం ఒక బ్లాక్ బస్టర్ సినిమాను చూసాము.ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు థియేటర్లోకి మరో కొత్త సినిమా వచ్చింది.
ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాము అంటూ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఈయన తన సినిమా స్టైల్ లోనే చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇంతలోనే మరోక అభిమాని మీరు ఎన్టీఆర్ (NTR)తో కలిసి దిగినటువంటి ఒక అరుదైన ఫోటోని షేర్ చేయండి అనడంతో నాని కూడా ఎన్టీఆర్ తో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.ఇక హాయ్ నాన్న సినిమా తండ్రి కూతురు మధ్య కొనసాగే అనుబంధం గురించి ఎంతో అద్భుతంగా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.
ఇక ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించిన సంగతి తెలిసిందే.