ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఫెయిల్యూర్లు( Failures ) ఎదురవుతూ ఉంటాయి.ఈ ఫెయిల్యూర్స్ కొంతమంది కెరీర్ సక్సెస్ సాధించడానికి ఉపయోగపడితే మరి కొందరు ఈ ఫెయిల్యూర్స్ వల్ల నిరాశకు గురవుతూ ఉంటారు.
అయితే ఉమా హారతి( Uma Harathi ) మాత్రం ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా వెనుకడుగు మాత్రం వేయలేదు.ఐదో ప్రయత్నంలో ఉమా హారతి ఆలిండియా స్థాయిలో 3వ ర్యాంక్ సాధించారు.పదో తరగతిలో ఉమా హారతి 9.8 జీపీఏ సాధించారు.
ఇంటర్ లో 955 మార్కులు సాధించిన ఉమా హారతి 2017లో ఐఐటీ హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్( Civil Engineering ) పూర్తి చేశారు.సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ఉమా హారతి జాబ్ కు బదులుగా సివిల్స్ పై( Civils ) దృష్టి పెట్టారు.
ఢిల్లీలోని ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉమా హారతి చేరగా ఆమెకు కోచింగ్ నచ్చలేదు.దేశ, అంతర్జాతీయ సంఘటనల గురించి ఆంగ్ల దినపత్రిల ద్వారా తెలుసుకున్నానని ఆమె తెలిపారు.

ఈ ఏడాదంతా నారాయణపేటలో( Narayanapeta ) ఉండి చదువుకున్నానని ఉమా హారతి అన్నారు.సివిల్స్ లో మూడో ర్యాంక్( Civils Third Rank ) సాధించానని ఆమె పేర్కొన్నారు.నాన్న ఐపీఎస్ అధికారి కావడంతో నాన్న నుంచి స్పూర్తి తీసుకున్నానని ఉమా హారతి వెల్లడించారు.గత ప్రయత్నాల్లో నాలుగుసార్లు ఫెయిల్ అయినా తమ్ముడు సపోర్ట్ ఇచ్చారని ఉమా హారతి కామెంట్లు చేశారు.

ఉమా హారతి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ఉమా హారతి సక్సెస్ స్టోరీ( Success Story ) ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.రాబోయే రోజుల్లో ఉమా హారతి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సివిల్స్ లో మూడో ర్యాంక్ సాధించారంటే ఉమా హారతి ఏ స్థాయిలో కష్టపడ్డారో అర్థమవుతుంది.
టాపర్ ఉమా హారతి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.