30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయ్యారు నటుడు పృథ్వీరాజ్( Prudhvi Raj ).ఇలా సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు.
ఇలా రాజకీయాలలోకి వచ్చినటువంటి పృథ్వీరాజ్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.అయితే ప్రస్తుతం రాజకీయాలకు మెల్లమెల్లగా దూరం అవుతూ ఈయన సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా అయ్యారు.
ఇకపోతే పృధ్విరాజ్ తాజాగా తన కుమార్తె శ్రీలు ( Sreelu ) హీరోయిన్ గా తెరకెక్కుతున్నటువంటి కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాకు దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా ఈయన తన కుమార్తెతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.ఈ ప్రోమోలో భాగంగా యాంకర్ శ్రీలు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు.
గత కొంతకాలంగా ఈమె ప్రేమలో ఉంది అంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో యాంకర్ మరి కొద్ది రోజులలో స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతున్నారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఆమె తెగ సిగ్గు పడిపోగా పృథ్విరాజ్ సైతం ప్రేమ వ్యవహారాల గురించి పలు విషయాలు వెల్లడించారు.
ఈమె ఏ హీరోని పెళ్లి చేసుకోబోతుంది ఎవరి ఇంటికి కోడలుగా వెళ్లబోతుందనే విషయాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు చూడాలి.అయితే ఈ విషయంపై నేటిజన్స్ ఆ అబ్బాయి ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.అదేవిధంగా ఇప్పటివరకు నాన్న ఇండస్ట్రీలో ఉండి ఎన్ని వేల కోట్లు సంపాదించారు.1000 కోట్ల 2000 కోట్ల అంటూ కూడా ప్రశ్నించారు.ఇక పృధ్విరాజ్ ను ప్రశ్నిస్తూ రాపిడ్ ఫెయిర్ లో భాగంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అంటే మీరు ఎవరి పేరు చెబుతారు అనగా ఇప్పుడు అంతా ఒకటే రెండు జండాలు మావే అంటూ ఈయన చెప్పిన సమాధానం కూడా సంచలనంగా మారింది.