తెలంగాణలో పోలిటికల్ హీట్ తార స్థాయిలో కొనసాగుతోంది.ఈసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్నీ ప్రధాన పార్టీలు అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకొని ప్రచారలతో హోరెత్తిస్తున్నాయి.
ఇక ఈసారి ఎన్నికలతో ఎలాగైనా బిఆర్ఎస్( BRS ) అధికారానికి చెక్ పెట్టి తాము అధికారం చేపట్టాలని కాంగ్రెస్ నేతలు( Congress ) తెగ ఆరాటపడుతున్నారు.దాంతో బిఆర్ఎస్ ను ఇరుకున పెట్టె ప్రతి అంశాన్ని కూడా ఆయుధంగా మలచుకొని విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
ప్రధానంగా బిఆర్ఎస్ వల్ల రాష్ట్రంలో కుటుంబ పాలన( Family Rule ) సాగుతోందని, తెలంగాణ మొత్తం కేసిఆర్ కుటుంబంలో( KCR Family ) బందీ అయిందని, ఈ కుటుంబ పాలనను తరిమికొట్టాలని కాంగ్రెస్ నేతలు ప్రధానంగా విమర్శిస్తున్నారు.
![Telugu Cm Kcr, Congress, Rule, Kavitha, Kcr, Priyanka Gandhi, Rahul Gandhi, Soni Telugu Cm Kcr, Congress, Rule, Kavitha, Kcr, Priyanka Gandhi, Rahul Gandhi, Soni](https://telugustop.com/wp-content/uploads/2023/11/BRS-Congress-Same-Criticism-detailsd.jpg)
అయితే కుటుంబ పాలన గురించి విమర్శించే హక్కు కాంగ్రెస్ కు లేదని బిఆర్ఎస్ నేతలు కూడా ఘట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.గత అరవై ఏళ్లుగా దేశాన్ని దోచుకున్నది కాంగ్రెస్ లోని గాంధీ కుటుంబం( Gandhi Family ) కదా అంటూ ప్రతివిమర్శ చేస్తున్నారు గులాబీ నేతలు, ప్రస్తుతం కూడా కుటుంబ రాజకీయానికి కాంగ్రెస్ పెట్టింది పేరని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఇలా కుటుంబం అంతా కలిసి తెలంగాణను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, అసలు కుటుంబ రాజకీయానికి కాంగ్రెస్ పెట్టింది పేరని విమర్శలు గుప్పిస్తున్నారు.
![Telugu Cm Kcr, Congress, Rule, Kavitha, Kcr, Priyanka Gandhi, Rahul Gandhi, Soni Telugu Cm Kcr, Congress, Rule, Kavitha, Kcr, Priyanka Gandhi, Rahul Gandhi, Soni](https://telugustop.com/wp-content/uploads/2023/11/BRS-Congress-Same-Criticism-detailss.jpg)
దీంతో అటు బిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ఎత్తుకున్న కుటుంబ పాలన అంశం ఇరు పార్టీలను కూడా ఇబ్బంది పెట్టెలా ఉన్నాయనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.ఈ పారిణామాలన్నీ గమనిస్తున్న బీజేపీ.( BJP )” కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు ఒకటేనని విమర్శిస్తూ మరింత హీట్ పెంచుతోంది.
మరి తెలంగాణ ఎన్నికల్లో ఈ కుటుంబ పాలన అంశం ఎంతవరకు ప్రభావం చూపుతుందో అనేది డిసెంబర్ 3 న తేలిపోనుంది.ప్రస్తుతం అధికార బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి.
మరి ఈ రెండు పార్టీలలో ఏదైనా పార్టీ అధికారం సాధిస్తుందా ? లేదా మూడో పార్టీ షాక్ ఇస్తుందా అనేది చూడాలి.