నిత్యం మనం ఎన్నో రకాల వంటలు వండుకుంటూ ఉంటాము.అయితే ఉదయం వండిన ఆహారాన్ని( Cooked Food ) రాత్రికి తినే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.
అలాగే రాత్రి మిగిలిపోయిన రైస్, చపాతీ, కూరలను మళ్ళీ తర్వాత రోజు కూడా తింటుంటారు.ఈ క్రమంలోనే ఆయా ఆహారాలను వేడి చేస్తుంటారు.
అయితే ఇలా మళ్లీ మళ్లీ వేడి చేసి తినే ప్రాసెస్ లో కొన్ని ఆహారాలు చాలా ప్రమాదకరంగా మారుతుంటాయి.మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటాయి.
మరి అటువంటి ఆహారాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.
రైస్.
( Rice ) అందరి ఇళ్లలోనూ ప్రతి పూట ఎంతో కొంత మిగిలి పోతుంటుంది.ఆ రైస్ ను చాలామంది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటారు.
తర్వాత రోజు వేడి చేసుకుని తింటుంటారు.ఇలా మీరు చేస్తున్నారా.
అయితే డేంజర్ లో పడ్డట్లే.రైస్ లో స్పోర్స్ అని పిలవబడే బ్యాక్టీరియా ( Bacteria ) ఉంటుంది.
అందువల్ల వండిన అన్నాన్ని మళ్లీ వేడి చేసి తింటే ఆ బ్యాక్టీరియా మనకు హాని కలిగిస్తుంది.

అలాగే గుడ్డుతో( Eggs ) చేసిన ఏ ఆహారాన్ని అయినా కూడా మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు.ఎందుకంటే గుడ్డులోని పచ్చసొన లో ప్రోటీన్ ఉంటుంది.ఇది మళ్లీ వేడి చేసినప్పుడు హానికరమైన బ్యాక్టీరియాగా మారుతుంది.
దీంతో ఆ ఆహారాన్ని తింటే కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

పుట్టగొడుగులు( Mushrooms ) చాలా మందికి ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు.పుట్టగొడుగులతో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.అయితే పుట్టగొడుగులు కూడా ఒకసారి వండిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు.
అలా వేడి చేసిన మష్రూమ్స్ ను తింటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది.
అలాగే మళ్లీ మళ్లీ వేడి చేసి తినకూడని ఆహారాల్లో చికెన్( Chicken ) ఒకటి.
చికెన్ ను వండిన తర్వాత పదే పదే వేడి చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల చికెన్ లో ఉండే ప్రొటీన్లు వివిధ రూపాల్లో విచ్ఛిన్నమవుతాయి.
ఇది ఆరోగ్యానికి హానికరం.ఇక బచ్చలి కూర, బంగాళదుంప వంటి ఆహారాలను కూడా వండిన తర్వాత మళ్లీ వేడి చేసుకొని తినకూడదు.