నల్లటి పగిలిన పెదాలతో చిందెందుకు.. ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోండిలా!

సాధారణంగా ప్రస్తుత చలికాలంలో చాలా మంది పెదాలు పగిలిపోతుంటాయి.నల్లగా, అసహ్యంగా మారుతుంటాయి.

 Effective Way To Repair Dark And Chapped Lips , Dark Lips , Chapped Lips,-TeluguStop.com

ఇటువంటి పెదాలు ముఖ సౌందర్యాన్ని పూర్తిగా దెబ్బ తీస్తాయి.అందుకే పెదాలను మళ్లీ మునుపటిలా అందంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ లిప్ బామ్ మీకు గ్రేట్ గా సహాయపడుతుంది.ఈ లిప్ బామ్ తో ఇంట్లోనే ఈజీగా నల్లటి పగిలిన పెదాలను రిపేర్ చేసుకోవచ్చు.మరి ఇంతకీ ఆ లిప్ బామ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు వాసెలిన్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్,( Rose water ) వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, ఆఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకోవాలి.చివరిగా పావు టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, ( Beet root powder )పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి డబుల్ బాయిలర్ మెథడ్ లో పూర్తిగా మెల్ట్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకుని ఒక బాక్స్ లో నింపుకోవాలి.తద్వారా మన లిప్ బామ్ సిద్ధం అవుతుంది.ఈ లిప్ బామ్ ను రోజుకు రెండు సార్లు కనుక వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది.ఈ లిప్ బామ్ పగిలిన పెదాలను చ‌క్క‌గా రిపేర్ చేస్తుంది.

మీ లిప్స్ ను మృదువుగా కోమలంగా మారుస్తుంది.ఈ లిప్ బామ్ నలుపును వదిలించి.

పెదాలను గులాబీ రంగులో అందంగా మెరిపిస్తుంది.ఈ హోమ్ మేడ్ లిప్ బామ్ ను తయారు చేసుకుని వాడితే డ్రై లిప్స్ సమస్య ఉండదు.

మరియు డార్క్ లిప్స్ ( Dark lips )సైతం దూరం అవుతాయి.మీ పెదాలు ఆకర్షణీయంగా మెరుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube