శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో మరోసారి పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తం అయ్యారు.ఈ క్రమంలోనే చీడిపేటలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు.
అనంతరం స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.