ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) నేటి నుంచి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ ( jagan )కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమం కొనసాగనుంది.ఈ కార్యక్రమాన్ని వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
గత నాలుగున్నర ఏళ్ల వైసిపి పాలనలో చేసిన అభివృద్ధి , సంక్షేమాలను ప్రజలకు వివరించడంతోపాటు , గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విధంగా ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, పార్టీకి సంబంధించిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు .వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సచివాలయాల ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారు.
అదే సమయంలో వైసీపీకి సంబంధించిన గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ మండల స్థాయి నాయకులు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తారు.దీంతోపాటు 2014 ఎన్నికల సమయంలో టిడిపి, జనసేన ,బిజెపిలో( TDP, Janasena, BJP ) కలిసి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ,అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయని హామీలను ప్రజలకు వివరిస్తారు .ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి , డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వంటి వైఫల్యాలను ప్రజలకు వివరిస్తారు.ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు అంశాలు ప్రధానంగా హైలెట్ చేయనున్నారు.
మొదట రోజు సచివాలయాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి , సచివాలయ పరిధిలో ఎంతమందికి పథకాలు ద్వారా ప్రయోజనం కలిగింది, ఎంత మేరకు లబ్ధి కలిగింది, అదే విధంగా ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది అనే విషయాలతో కూడిన బోర్డులను ప్రదర్శిస్తారు.మొదటి రోజు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడతారు.
అనంతరం స్థానికంగా ప్రభావితం చేసే వ్యక్తులు, వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
రెండో రోజు సచివాలయ పరిధిలో ప్రతి గడపను సందర్శిస్తారు.రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అభివృద్ధి, అధికారంలోకి జగన్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి , తలసరి ఆదాయం పెరుగుదల వంటి విషయాలను ప్రజలకు వివరించనన్నారు.ఈ విధంగా డిసెంబర్ 19 వరకు వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు .ఏపీ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నట్లుగా వైసిపి రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తుండడంతో , దాన్ని తిప్పికొట్టేందుకు ప్లాన్ చేశారు.ఇంకా అనేక విషయాలపై ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు వై ఏపి నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని రూపొందించారు.