వ్యవసాయ భూమి తక్కువగా ఉండే రైతులు( Farmers ) కూరగాయలు,ఆకు కూరలు సాగు చేసి మంచి దిగుబడులను సాధించి లాభాలు అర్జిస్తున్నారు.కాకపోతే సాగు విధానంపై అవగాహన ఉంటే శ్రమ తో పాటు పెట్టుబడి తగ్గి అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.
ఆకుకూరల విషయానికి వస్తే.తోటకూరను ఇష్టపడని వారు ఉండరు.
తక్కువ వ్యవసాయ భూమి ఉండి ఆకుకూరలు సాగు చేయాలి అనుకునేవారు తోటకూర సాగు చేస్తే మంచిది.తోటకూర సాగులో ఎరువుల యజమాన్యంతో పాటు సాగులో ఈ మెళుకువలు పాటిస్తే మంచి దిగుబడి సాధించవచ్చుతోటకూర సాగుకు ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలం.
నీరు నిల్వ ఉండే బంకమట్టి నేలలు, ఇసుక నేలలు తోటకూర సాగుకు పనికిరావు.
ఒక ఎకరం పొలానికి 800 గ్రాముల తోటకూర విత్తనాలు అవసరం.ముందుగా నేలను మూడు లేదా నాలుగు సార్లు బాగా దుక్కి దున్నాలి.ఆ తర్వాత ఒక ఎకరాకు దాదాపుగా 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి.
ఇంకా 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఎరువులు( Potash fertilizers ) వేయాలి.విత్తిన 15 రోజుల తర్వాత ఒక లీటరు నీటిలో 20 గ్రాముల యూరియా, 20 పి.
పి.యమ్ జిబ్బరెల్లిన్ ( P.P.yum gibberellin )ఆసిడ్ కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
కలుపు నివారణ( Weed control ) కోసం ఒక ఎకరాకు డ్యుయల్ మందును ఒక ఎకరాకు లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పంటవిత్తిన 48 రోజులలోపు పొలంలో పిచికారి చేయాలి.భూమిలో తేమ శాతాన్ని బట్టి పది రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి.వేసవికాలంలో సాగు చేస్తే ఐదు లేదా ఆరు రోజులకు ఒక నీటి తడి అందించాలి.తోటకూర మొక్కల అడుగు బాగాన తెల్లటి బుడిపెలు ఏర్పడిన, ఆకుపై లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడిన వెంటనే ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ను కలిపి మొక్కల ఆకుల అడుగుభాగం బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
పంట విత్తిన 25 రోజులకు మొదటిసారి కోతకు వస్తుంది.తోటకూర పంట( Thotakura cultivation ) వ్యవధి కాలం 90 రోజులు.అంటే మొదటిసారి కోతల తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి కోతలు చేస్తే ఒక ఎకరం పొలంలో దాదాపుగా ఐదు టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.