కెనడియన్ ఎంపీ మెలిస్సా లాంట్స్‌మన్( Canadian MP Melissa Lantsman ) గురువారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో హిందూ ఫోబియాను( Hinduphobia ) గుర్తించాలని కోరుతూ పిటిషన్‌ను సమర్పించారు. ‘‘ఈ-4507 ’’ పిటిషన్‌పై అక్టోబర్ 17 వరకు 25,794 మంది సంతకాలు చేశారు.
ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వ ప్రతిస్పందనను కూడా మెలిస్సా కోరారు.కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో( House Of Commons ) కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ లీడర్‌గా వ్యవహరిస్తున్న మెలిస్సా మాట్లాడుతూ.
హిందూ ప్రజలపైనా, వారి ప్రార్ధనా స్థలాలలో దాడుల పెరుగుదలను చూస్తున్నామన్నారు.ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ సురక్షితంగా వుండేందుకు అర్హులని.
బెదిరింపులు, హింస, వేధింపులు, విధ్వంసం లేకుడా మత ఆచారాలను అనుసరించవచ్చని మెలిస్సా పేర్కొన్నారు.
హిందువులు పని ప్రదేశాల్లో, పాఠశాలల్లో, కమ్యూనిటీల్లో వివక్షను ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు.
సంప్రదాయాలు, సంస్కృతులు తప్పుగా సూచించబడ్డాయి.తప్పుగా అర్ధం చేసుకోబడ్డాయని మెలిస్సా చెప్పారు.
కెనడాలో( Canada ) అధికారికంగా హిందూ వారసత్వ మాసంగా పాటించే రెండో రోజున ఈ పిటిషన్‌ను( Petition ) సమర్పించినట్లుగా ఆమె పేర్కొన్నారు.ప్రధాన దేవాలయాలతో పాటు 80 కమ్యూనిటీ సంస్థల నుంచి ఈ పిటిషన్ మద్ధతు పొందిందని మెలిస్సా అన్నారు .హిందూ వ్యతిరేక పక్షపాతం, వివక్షను వివరించడానికి మానవ హక్కుల కోడ్‌లోని పదాల పదకోశంలో హిందూఫోబియాను ఒక పదంగా గుర్తించాలని సభను కోరుతున్నామని ఆమె పేర్కొన్నారు.
భారత సంతతికి చెందిన కెనడియన్ హిందువులను లక్ష్యంగా చేసుకుని సెప్టెంబర్‌లో వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ( Gurpatwant Singh Pannu ) ఓ వీడియోను విడుదల చేయడంతో ఈ పిటిషన్ ఊపందుకుంది.హిందువులంతా తక్షణం కెనడాను వదిలిపెట్టాల్సిందిగా ఎస్ఎఫ్‌జే హెచ్చరించింది.నిజ్జర్ హత్యకు గాను భారతదేశానికి మద్ధతుగా హింసను ప్రోత్సహించినందుకు కెనడాను విడిచిపెట్టాల్సిందిగా అల్టీమేటం జారీ చేసింది.
ఇక్కడున్న హిందువులు భారతదేశానికి మద్ధతు ఇవ్వడమే కాకుండా.ఖలిస్తాన్ ( Khalistan ) మద్ధతుదారుల ప్రసంగాలు, వ్యక్తీకరణను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్ఎఫ్‌జే ఆరోపించింది.
ఎజ్ఎఫ్‌జే ( Sikhs For Justice ) వీడియోనే కాకుండా.కెనడాలోని భారత్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్తలకు బెదిరింపులు.
వారి పోస్టర్‌లు, గ్రాఫిటీలతో దేవాలయాలను అపవిత్రం చేసిన ఘటనలు ఈ వేసవి నుంచి భారీగా పెరిగాయి.ఈ చర్యలు కెనడాలో హిందూ ఫోబియా సమస్య తెరపైకి రావడదానికి దారి తీశాయి.
ఈ ఘటనలను ఇఫ్పటికే కెనడాలో విపక్ష నేత పియరీ పొయిలీవ్రే ఖండించారు.
ఈ ఏడాది జూలై 19న ‘‘పిటిషన్, e-4507 ’’ను( e-4507 Petition ) ఇండో కెనడియన్ సంస్థ, కెనడియన్ ఆర్గనైజేషన్ ఫర్ హిందూ హెరిటేజ్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రారంభించింది.ఈ సంస్థ డైరెక్టర్ విజయ్ జైన్ మాట్లాడుతూ.ఇది మైనారిటీ హిందూ సమాజం నుంచి వచ్చిన తొలి పిటిషన్ అని చెప్పారు.మొత్తం జనాభాలో 2.5 శాతానికి పైగా.25000కు పైగా ఎక్కువ సంతకాలను పొందడం చాలా ఆందోళన కలిగించే విషయమన్నారు.హిందూ వ్యతిరేక పక్షపాతం, వివక్షను నివారించడానికి మానవ హక్కుల కోడ్‌లోని పదాల పదకోశంలో హిందూఫోబియాను ఒక పదంగా గుర్తించాలని.
హిందుత్వాన్ని తిరస్కరించడం, పక్షపాతాన్ని దూషణగా నిర్వచించాలని పిటిషన్‌లో కోరారు.ఈ ఏడాది ప్రారంభంలో బ్రాంప్టన్‌లోని సిటీ కౌన్సిల్ హిందూఫోబియాను గుర్తిస్తూ ఇదే విధమైన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఇది ఫెడరల్ పార్లమెంట్‌లోనూ ఆమోదం పొందాలని తాము ఆకాంక్షిస్తున్నామని జైన్ చెప్పారు.