Prabhas : ఆ స్టార్ హీరో పై సీరియస్ అయినా ప్రభాస్… అంత కోపం ఏంటి డార్లింగ్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచితనానికి మారుపేరు అయినటువంటి వారిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) ఒకరు.ఎంతో మంచి నడవడికతో మంచి మనస్తత్వంతో ప్రభాస్ ని పెంచారన్న విషయం మనకు తెలిసిందే.

 Prabhas Gave Warning To Star Hero Latest News Viral In Social Media-TeluguStop.com

ఇలా ప్రభాస్ పెద్దల పట్ల ఎంతో గౌరవంగా ఉండటమే కాకుండా ఇతరుల పట్ల కూడా జాలి దయ ప్రేమ కలిగి ఉంటారనే విషయం మనకు తెలిసిందే.శత్రువైన సరే ఇంటికి వస్తే వారి కడుపు నింపి పంపించాలని వారికి అతిథి మర్యాదలు చేయాలి అన్న కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ప్రభాస్.

Telugu Krishnam Raju, Prabhas, Tollywood-Movie

తన తండ్రి పెదనాన్న ఇలాంటి మంచి లక్షణాలతో పెరిగి తన పిల్లలకు కూడా అదే నడవడికను నేర్పించారని చెప్పాలి.ఇలా ఇతరుల పట్ల ఎంతో ప్రేమగా ఉండే ప్రభాస్ పొరపాటున కూడా ఎవరిని కించపరిచే విధంగా ఎవరు బాధపడే విధంగా మాట్లాడరు అయితే ఒకానొక సమయంలో చాలా కోపం వచ్చి ఏకంగా తన ప్రాణ స్నేహితుడు అయినటువంటి మరొక టాలీవుడ్ స్టార్ హీరో( Tollywood Star Hero ) పట్ల నా కొడకా అంటూ నోరు జారారట.ఇలా ప్రభాస్ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.

ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నటువంటి ప్రభాస్ ఇలా నోరు జారడానికి గల కారణం ఏంటి అసలు ఈయన ఏ విషయంలో ఆ హీరో పట్ల మాట్లాడాల్సి వచ్చింది ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే… ప్రభాస్ తన స్నేహితుడి పట్ల ఇలా అవమర్యాదకరంగా మాట్లాడినది ఆయన హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కాదు చిన్నతనంలోనే తన స్నేహితుడి పట్ల ఇలా దురుసుగా మాట్లాడారని తెలుస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక స్టార్ హీరో ప్రభాస్ కి ప్రాణ స్నేహితుడు అనే విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ చిన్నప్పుడు ఒకే స్కూల్ కి వెళ్లేవారట.

Telugu Krishnam Raju, Prabhas, Tollywood-Movie

ఇలా స్కూల్లోనే వీరిద్దరూ కూడా ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నారు.ఎప్పుడు ఎంతో సరదాగా ఉండే ప్రభాస్ మరొక హీరో ఇద్దరూ కూడా స్కూల్లో ఒకరి క్యారేజ్ మరొకరు మార్చుకొని తినడం ఇలా ప్రాణ స్నేహితులుగా ఉండే వారట అయితే ఒక రోజు తన స్నేహితుడు ప్రభాస్ ను చాలా విసిగించారట.దీంతో ప్రభాస్ కోపం తట్టుకోలేక నా కొడకా అంటూ తన స్నేహితుడి పై నోరు పారేసుకున్నారు.అయితే ఈ విషయం కృష్ణంరాజు( Krishnam Raju )గారికి తెలిసి వెంటనే ప్రభాస్ ను తన గదికి పిలిపించి తనకు ఎంతో అర్థమయ్యే విధంగా తెలియజేశారట.

Telugu Krishnam Raju, Prabhas, Tollywood-Movie

ఇతరుల పట్ల ఎప్పుడు కూడా అలా దురుసుగా ప్రవర్తించకూడదని అయినా చిన్నతనం నుంచి ఇలాంటి మాటలు నీ నోటి వెంట రావడం ఏంటి ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి అంటూ కృష్ణంరాజు గారు తన స్టైల్ లో ప్రభాస్ కి అర్థమయ్యే విధంగా తెలియజేశారట అప్పటినుంచి ప్రభాస్ మాట్లాడే ప్రతి మాట ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుతూనే ఉంటారు.మరి ప్రభాస్ తిట్టిన ఆ స్టార్ హీరో ఎవరు ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ప్రభాస్ త్వరలోనే సలార్ ( Salaar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube