ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించడానికి బస్సు యాత్ర చేపట్టామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఈ యాత్రలోభాగంగా ప్రతిపక్షాల కుట్రలను కూడా ప్రజలకు తెలియజేస్తామని మంత్రి బొత్స తెలిపారు.
గతంలో టీడీపీ దోపిడీ, ప్రజాధనం దుర్వినియోగంపై వివరిస్తామన్నారు.అదేవిధంగా రాబోయే రోజుల్లో తాము చేసే అభివృద్ధిపై భరోసా ఇచ్చేందుకు యాత్రను చేపట్టామని స్పష్టం చేశారు.
కాగా ఏపీలో ఇవాళ్టి నుంచి సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, గుంటూరు జిల్లాలోని తెనాలి, అనంతపురం జిల్లాలోని శింగనమల నుంచి వైసీపీ బస్సు యాత్రలు ప్రారంభం అవుతాయి.
కాగా ఈ యాత్రల్లో ఆయ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.