హెయిర్ ఫాల్ అనేది కొందరిలో చాలా బీభత్సంగా ఉంటుంది.ఈ సమస్య కారణంగా తీవ్రమైన ఒత్తిడికి కూడా లోనవుతుంటారు.
కానీ ఒత్తిడిని పెంచుకుంటే జుట్టు రాలడం తగ్గడం కాదు మరింత పెరుగుతుంది.కాబట్టి ఒత్తిడిని పక్కన పెట్టి జుట్టు రాలటాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాలి.
అయితే అందుకు మన వంటింట్లో ఉండే బిర్యానీ ఆకు( Biryani leaf ) అద్భుతంగా సహాయపడుతుంది.హెయిర్ ఫాల్( Hair fall ) ఎంత తీవ్రంగా ఉన్నా బిర్యానీ ఆకుతో చెక్ పెట్టవచ్చు.
మరి ఇంతకీ బిర్యానీ ఆకును జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.అలాగే మూడు లేదా నాలుగు బిర్యానీ ఆకులను తీసుకుని తుంచి అందులో వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ లవంగాలు, ( cloves )ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడికించాలి.
దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ( Coconut oil )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మంచి హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలమన్నా రాలదు.హెయిర్ ఫాల్ సమస్య( Hair fall problem ) చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.చుండ్రు సమస్య( Dandruff problem ) ఉంటే దూరం అవుతుంది.
తలలో ఇన్ఫెక్షన్, దురద వంటివి సైతం మాయం అవుతాయి.కాబట్టి, అధిక హెయిర్ ఫాల్ తో సతమతం అవుతున్నవారు తప్పకుండా బిర్యానీ ఆకుతో పైన చెప్పిన విధంగా చేయండి.
మంచి రిజల్ట్ మీసొంతం అవుతుంది.