తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.
ఇక ఈమె కుమార్తె హన్సిత రెడ్డి(Hanshitha Reddy) కూడా నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి(Archith Reddy)కారు దొంగతనం జరిగిందనే విషయం తెలియడంతో ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి షాక్ అవుతున్నారు.అసలు దిల్ రాజు అల్లుడు కారు(Car) దొంగలించడం ఏంటి అసలేం జరిగింది అనే విషయాన్ని వస్తే…

దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్ కు వెళ్లారు హోటల్ ముందు కారు పార్క్ చేసి ఆయన తిరిగి 40 నిమిషాల వద్ద అక్కడికి రావడంతో అక్కడ తన కారు లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.దీంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు( Jubilee Hills Police ) ఫిర్యాదు చేయడంతో పోలీసులు అర్చిత్ రెడ్డి నుంచి అన్ని వివరాలను తెలుసుకొని తమ బృందంతో రంగంలోకి దిగారు.అయితే ఈ కారు దొంగతనం జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.అయితే కారు దొంగలించినటువంటి ఆ వ్యక్తిని పోలీసులు విచారణ చేయక ఆయన చెప్పిన మాటలు విన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా కంగు తిన్నారు.

దిల్ రాజు అల్లుడు పోర్షే కారు ( Porsche Car ) దాదాపు 1.7 కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలుస్తుంది.ఈ కారు దొంగలించిన ఆ వ్యక్తినీ పోలీసులు విచారించగా ఆయన ఏకంగా ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) కుమారుడు ఆకాష్ అంబానీ పిఏ( Akash Ambani PA ) అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.మంత్రి కేటీఆర్ కారు తీసుకెళ్లారని చెప్పారని.
దీంతో తన అసిస్టెంట్ హ్రతిక్ రోషన్ తో కలిసి కారును అకాశ్ అంబానీ వద్దకు తీసుకెళుతున్నట్లు చెప్పారు.అతడి మాటలకు విస్తుపోయిన పోలీసులు.
నిందితుడి పాటలకు విస్తుపోయినటువంటి పోలీసులు అతని గురించి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.నిందితుడు మన్సూరాబాద్ కు చెందిన సాయి కిరణ్ గా గుర్తించారు.
గడిచిన కొద్ది కాలంగా మతిస్థిమితం లేదని.బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ లో చికిత్స పొందుతున్నట్లుగా గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు.