మహేష్ తో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి”.( Bhagavanth Kesari ) టాలీవుడ్ లో అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 Anil Ravipudi Gives Clarity On His Next Projects, Balakrishna, Anil Ravipudi, Bh-TeluguStop.com

ఈయన తీసిన సినిమాలన్నీ హిట్ అనిపించుకున్నాయి కానీ ప్లాప్ అవ్వలేదు.దీంతో స్టార్ డైరెక్టర్ల సరసన ఈయన పేరు కూడా చేరిపోయింది.

ప్రజెంట్ ఈయన భగవంత్ కేసరి సినిమాను రిలీజ్ కు సిద్ధం చేసారు.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంత ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇక దసరా బరిలో ఈ సినిమాతో ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఈ మధ్యన వరుస ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసి ఎప్పుడెప్పుడు సినిమాను చూస్తామా అని ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగేలా చేసారు.

ఇక తాజాగా అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు( Mahesh babu )తో సినిమా విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు.

గత కొద్దీ రోజులుగా ఈ కాంబోలో మరో మూవీ రాబోతుందంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.మహేష్ త్రివిక్రమ్ తో గుంటూరు కారం( Guntur Karam ) తర్వాత రాజమౌళి సినిమా చేయబోతున్నాడు.

అయితే జక్కన్న( Rajamouli ) కంటే ముందే అనిల్ తో ఒక సినిమా చేయనున్నాడు అనే రూమర్స్ వస్తుండడంతో వీటికి క్లారిటీ ఇచ్చారు.తనకు మహేష్ గారికి మరో సినిమా చేసే సాన్నిహిత్యం ఉందని కానీ మహేష్ గారి 29వ సినిమా తాను చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని అవన్నీ అబ్బడం అంటూ క్లారిటీ ఇచ్చేసాడు.దీంతో ఈ కాంబోపై గత కొన్ని రోజుల క్రితం నుండి వస్తున్న వార్తలకు చెక్ పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube