రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక శుభోదయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది.అందులో భాగంగా మన రాష్ట్ర పండుగ చాలా రోజుల నుంచి అతి ప్రాచీనంగా జరుపుకునేటువంటి పండుగ ప్రకృతి గురించి తెలియజేసిన పండుగ ప్రకృతిలో ఉన్నటువంటి పువ్వులను సమీకరించి శివుని రూపంలో అమర్చి జరుపుకునే పండుగ.
ఎంగిలి పూల తోటి ప్రారంభమై సద్దుల బతుకమ్మ తోటి పూర్తవుతుంది.
అమ్మవారు తొమ్మిది రూపాయలలో కనబడుతుంది.ఐదు రోజులు అత్యంత ఘనంగా వైభవంగా జరుపుకునే పండుగ ఎంగిలిపూవులతోని ప్రారంభమై సద్దుల బతుకమ్మతోటి పూర్తయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిండి నైవేద్యాలను సమర్పించడం జరుగుతుంది.2014 మార్చి 16వ తేదీ నుండి బతుకమ్మ పండుగ మన జాతీయ పండుగగా తెలియడం జరుగుతుంది.కార్యక్రమంలో శుభోదయం పాఠశాల ప్రిన్సిపాల్ గంప సుధాకర్, కరస్పాండెంట్ ఎం శ్రీనివాస్ యాదవ్, పి ఈ టి అజయ్ కుమార్,అనిల్, సుజాత, కళావతి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.