రాజన్న సిరిసిల్ల జిల్లా :సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయం ను కాళేశ్వరం, సహా అనేక సాగు నీటి ప్రాజెక్టులతో స్వరాష్ట్రంలో పండుగ మార్చిన ఘనత సిఎం కేసిఆర్ దే నని రాష్ట్ర మంత్రి కే తారక రామారావు అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో బుధవారం వ్యవసాయ కళాశాలను మంత్రి నిరంజన్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
కళాశాలలో వివిధ విభాగాలు,వాటి పనితీరును పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నామని హర్షం వ్యక్తం చేశారు.దేశానికే దిశానిర్దేశం చేసే వ్యవసాయ శాస్త్రవేత్తలుగా జిల్లెల కళాశాలలోనీ విద్యార్థులు తయారు కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే దశదిశ చూపుతోందని అన్నారు.సిఎం కేసిఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ విస్తరణ జరిగిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని కొందరు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.వారు తెలిసి మాట్లాడుతున్నారా.తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదన్నారు.ఈ కార్యక్రమానికి హెలికాప్టర్లో వస్తున్నప్పుడు.
వరుసగా ఉన్న కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్,మిడ్ మానేరులో నీళ్లు నిండి కళకళలాడుతుంటే ఎంతో సంబురంగా అనిపించిందని హర్షం వ్యక్తం చేశారు.సమైక్య రాష్ట్రంలో ఏ ఒక్క రిజర్వాయర్ లేదన్నారు .తెలంగాణ లో కొత్తగా చేపట్టిన రిజర్వాయర్ ల ద్వారా భూగర్భజల మట్టం పెరిగి కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని మంత్రి స్పష్టం చేశారు.
కేసిఆర్ అంటే నే రైతు బంధు అని చెప్పిన కే టి ఆర్, దండగ అన్న వ్యవసాయం పండుగ చేశారని కొనియాడారు.
సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అన్నప్పుడు వ్యవసాయ కళాశాలతో పాటుగా పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరైందని తెలిపారు.
విద్యార్థులు ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలు గా, ఎంటర్ ప్రెన్యూ ర్ గా ఎదగాలని అన్నారు.ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కు సాటి లైట్ క్యాంపస్ మంజూరు తో పాటువ్యవసాయ కళాశాల ను పీజీ కళాశాల గా అప్గ్రేడ్ చేయాలనీ రాష్ట్ర మంత్రి కే తారక రామారావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కోరగా… సీఎం కేసీఆర్ తో అనుమతితో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే జిల్లెల్ల వ్యవసాయ కళాశాలకు డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ కళాశాలగా నామకరణం చేయాలని , కళాశాల ఆవరణలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆయన వ్యవసాయం శాఖ మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు.రాష్ట్ర శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ….
ఆధునిక సదుపాయాలు , అధునాతన సాంకేతిక పద్ధతులతో కూడిన వ్యవసాయ కళాశాల దేశంలోనే అత్యుత్తమ కళాశాలగా నిలుస్తుందని అన్నారు.తాను చిన్న, పెద్ద ఎందరో నాయకులను చూశానని….
తనదైన ప్రత్యేక పనితీరు, డైనమిజంతో ప్రపంచంలోనే పేరుగాంచిన వ్యక్తి మంత్రి కె తారక రామారావు అని కొనియాడిన సభాపతి మేము మా నియోజకవర్గాలలో 47 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కంటే మిన్నగా సిరిసిల్లను ఈ 9 ఎండ్లలో కేటీఆర్ అభివృద్ధి చేశారని ప్రశంసించారు.ఉబికి వచ్చిన భూగర్భ జలాల లో దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా నెంబర్ వన్ గా నిలిచి అఖిల భారత సర్వీస్ అధికారులకు పాఠంగా మారడం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఘనతనని ఆయన చెప్పారు.
స్వరాష్ట్రం తెలంగాణలో ఇన్ని రిజర్వాయర్లు వస్తాయని ఎవరైనా సమైక్య రాష్ట్రంలో ఊహించారా ? అని సభాపతి ప్రజలను ప్రశ్నించారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యమే కరువు ప్రాంతాలలో ప్రజలకు ఆహారంగా పంపిణీ అవుతుండడం మనందరికీ గర్వకారణం అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ఒక కోటి 8 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, కేసీఆర్ ప్రత్యేక చొరవతో అది రెండు కోట్ల 30 లక్షల పెరిగిందన్నారు.అంతేకాకుండా కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఐటీ రంగం అంతకంతకు అభివృద్ధి చెందుతూ 10 లక్షల మంది నిరుద్యోగులకు ఐటి రంగంలో ఉపాధి లభించింది అన్నారు.
తెలంగాణ పథకాలను మహారాష్ట్ర సహా పొరుగున ఉన్న రాష్ట్రాల ప్రజలు కొనియాడుతున్నారని….తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు అమలు చేయాలని ఆయా ప్రభుత్వాలను ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు.
తెలంగాణలో ఉన్న పథకాలు మరే రాష్ట్రంలో లేవని సభాపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు.మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.నేటి తరానికి మార్గదర్శకత్వం వహిస్తూనే రేపటి తరానికి నాయకత్వం వహించే దక్షత ఉన్న నాయకుడు మంత్రి కేటీఆర్ అని ప్రశంసించారు.ఆధునిక వసతులు ,సాంకేతిక పద్ధతులతో కూడిన వ్యవసాయ కళాశాల రావడం ఈ ప్రాంత విద్యార్థులకు అదృష్టమని మంత్రి చెప్పారు.
సమైక్య రాష్ట్రంలో భూములు కలిగి ఉన్న ప్రజలు సాగు జలాల లభ్యత లేక ధాన్యం గింజల కోసం ప్రభుత్వ రేషన్ కోసం క్యూ లైన్లు లో నిలబడే దుస్థితి ఉండేది అన్నారు.
ఆనాటి పరిస్థితులను చూసి చలించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి రాష్ట్రమును సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు.
సమైక్య చిధ్రమైన జీవితాలకు సిరిసిల్ల నేలవుగా మారిందని ఇప్పుడు .డైనమిక్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బంగారు భవిష్యత్తుకు నెలవుగా మారిందని అన్నారు.భూగర్భ జలమట్టం పెరగడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముస్సోలి లోని శిక్షణ ఐఏఎస్ లకు పాఠంగా మారడం గర్వకారణమన్నారు.సగానికి పైగా జనాభా వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్నదేశంలో ప్రభుత్వ ,ప్రైవేటు రంగాలలో కేవలం 700 లోపే వ్యవసాయ కళాశాలలు ఉన్నాయని తెలిపారు.
ప్రాధాన్యతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేస్తుందన్నారు.స్వరాష్ట్రంలో రైతాంగ సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకు వివిధ రూపేనా నాలుగు లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు .వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం వినూత్న నిర్ణయాలతో దేశ వ్యవసాయ రంగానికి ఒక కొత్త విప్లవాన్ని తెచ్చిందని ఆయన కొనియాడారు.సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది అన్నారు.
దేశం మొత్తంలో 95 లక్షల ఎకరాలలో వరి సాగు అయితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 56 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు అవుతున్న విషయం తెలిపారు.తెలంగాణలో ఏ ఇంట్లో చూసినా సంక్షేమం, ఏ ఊరు చూసినా పచ్చదనం కనిపిస్తుందన్నారు .భావితరాలకు నీటి మూట సంపదను కేసీఆర్ సృష్టించారని తెలిపారు .సమైక్య రాష్ట్రంలో పోరాటాలకు నెలవుగా మారిన రాజన్న సిరిసిల్ల అభివృద్ధిలో స్వరాష్ట్రం లో నెంబర్వన్ గా నిలిచిందని అన్నారు .జరిగిన పనిని, జరుగుతున్న పనిని మెచ్చుకుంటూ జరగాల్సిన పనిపై సూచనలు చేయాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.
కెసిఆర్ 20 ఏళ్ల క్రింద తెలంగాణ ఉద్యమాన్ని భుజాన్ని ఎత్తుకోకపోతే జిల్లాలో ఈ కళాశాల ఉండేదా అని ప్రజలను ప్రశ్నించారు.అసమానతలపై పోరాడిన నేల ,సీఎం కేసీఆర్ చొరవతో స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారిందన్నారు.
అమెరికా స్థాయిలో తెలంగాణలోని వ్యవసాయ కళాశాల లో వ్యవసాయ అభివృద్ధికి ఊతమిచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయి అన్నారు .త్వరలోనే వ్యవసాయ రంగం పరిశ్రమగా రూపాంతరం చెందుతుందని తెలిపారు .వ్యవసాయంలో రాబోయే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై విద్యార్థులు ఈ కళాశాలలో చేరిన మొదటి రోజు నుంచి ఆలోచించాలన్నారు.జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్లకు వ్యవసాయ కళాశాలను ఏర్పాటు కు కృషి చేసినందుకు మంత్రికే తారక రామారావు కృతజ్ఞతలు తెలిపారు.
వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు.ఈ గడ్డపై కళాశాల వస్తదని ఎవరు ఊహించలేదని.అమరులకు ఇది సరైన నివాళి అన్నారు .ప్రస్తుతం ఆహార భద్రత స్థానంలో పౌష్టికాహార భద్రత వచ్చిన దృష్ట్యా పుడ్ ప్రాసింగ్ యూనిట్లు పౌష్టికాహార భద్రతకు దోహదం చేస్తున్నాయన్నారు .పౌష్టికాహార భద్రతపై మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన అన్నారు.
చిన్న జిల్లా అయినా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాల, మెడికల్ కళాశాల తో పాటు సూపర్ స్పెషాలి హాస్పిటల్ వంటి గొప్ప మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల భవనం ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, శ్రీ నిరంజన్ రెడ్డి,శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే లు చెన్నమనేని రమేష్ బాబు, సుంకే రవి శంకర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి,ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ర ఘునందన్ రావు , రిజిస్ట్రార్ డాక్టర్ సుదీర్ బాబు, ప్రవీణ్ రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్,రాష్ట్ర పవర్‌లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్,టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ లు జిందం చక్రపాణి, రామతీర్థపు మాధవి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ తంగల్లపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో కోల్డ్ స్టోరేజ్ సెంటర్ ను ప్రారంభించారు.జిల్లెల్లలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.







