సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో అరియనా ( Ariyana ) కూడా ఒకరు.యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన టువంటి ఈమె పలువురు సినిమా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు.
అయితే ఎప్పుడైతే ఈమె రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిందో ఆ ఇంటర్వ్యూ ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఇలా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ( RGV Interview ) ద్వారా ఫేమస్ అయినటువంటి ఈమె అనంతరం ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలను అందుకున్నారు.
ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్( Bigg Boss ) ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో భాగమయ్యారు.అలాగే ఇతర ఈవెంట్లలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.అయితే ఈమధ్య కాలంలో అరియనా భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారనే చెప్పాలి.
అందుకు కారణం ఈమె అధికంగా శరీర బరువు పెరగడమే అని చెప్పాలి.ఒకప్పుడు సన్న జాజితీగల ఉన్నటువంటి ఈమె ఇప్పుడు మాత్రం భారీగా శరీర బరువు పెరిగారు.
ఈ విధంగా అరియనా ఫోటోలు వీడియోలు చూసినటువంటి అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.అసలు ఈమె ఏంటి గుర్తుపట్టలేని విధంగా లావు అయిపోయింది అంటూ కొందరు కామెంట్లు చేయగా మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమో ఒకసారి టెస్ట్లు చేయించుకోండి అంటూ కొందరు ఈమెకు కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా
అరియనా ఇలా ఉన్నపలంగా శరీర బరువు పెరగడం( Ariyana Weight ) అందరిని కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా ఒక బేకరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇలా ఈ బేకరీ ప్రారంభోత్సవ కార్యక్రమం( Bakery Shop Opening )లో భాగంగా అరియనా పాల్గొన్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇక ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమెను చూసి షాక్ అవుతున్నారు.అసలు ఏంటి మీరు ఇలా తయారయ్యారు గుర్తుపట్ట లేకుండా ఉన్నాము అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం అసలు బేకరీ ప్రారంభోత్సవానికి కూడా ఈమెను ఇన్వైట్ చేయాలా.తాను ఏమైనా పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నారా తనని పిలవడానికి అంటూ కామెంట్లు చేస్తూ అరియనా పరువు మొత్తం తీస్తున్నారు.
మొత్తానికి ఏదో ఒక విధంగా ఈ మధ్యకాలంలో అరియనా తరచూ వార్తలో నిలుస్తూ భారీగా ట్రోల్స్( Trolls on Ariyana ) ఎదుర్కొంటున్నారని చెప్పాలి.మరి ఈమె సన్నగా ఉండటం వల్లే బరువు పెరగాలన్న ఉద్దేశంతో ఇలా బరువు పెరిగారా లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో తెలియదు కానీ వెంటనే ఈమె తన శరీర బరువు పట్ల కాస్త శ్రద్ధ తీసుకోకపోతే ఇండస్ట్రీకి కూడా దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని పలువురు భావిస్తున్నారు.