అప్పుడు రిక్షావాలా కొడుకు.. ఇప్పుడు ఐఈఎస్ ఆఫీసర్.. ఇతని సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!

దేశంలో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఎంతో కష్టపడి కొంతమంది తమ లక్ష్యాలను సాధిస్తూ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.తమ సక్సెస్ తో ప్రశంసలను అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.

 Tanveer Ahmad Khan Ies Success Story Details Here Goes Viral In Social Media , T-TeluguStop.com

జమ్మూ కశ్మీర్ కు చెందిన తన్వీర్ అహ్మద్ ఖాన్ ( Tanveer Ahmed Khan )చదువుకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాదని ప్రూవ్ చేసుకున్నారు.

గతేడాది ఇండియన్ ఎకనమిక్ సర్వీస్( Indian Economic Service ) పరీక్షలో రెండో ర్యాంక్ సాధించి స్పూర్తిగా నిలిచారు.తన్వీర్ తండ్రి రిక్షా నడపడంతో పాటు వ్యవసాయం చేస్తున్నారు.2016 సంవత్సరంలో బీఏ పాసైన తన్వీర్ అహ్మద్ ఖాన్ కశ్మీర్ యూనివర్సిటీలో ఎం.ఏ ఎకనామిక్స్ లో ప్రవేశం పొందడంతో పాటు 2021 సంవత్సరంలో జే.ఆర్.ఎఫ్ ( J.R.F )సాధించడం గమనార్హం.కోల్ కతాలో ఎంఫిల్ పూర్తి చేసిన అహ్మద్ ఖాన్ 2021 ఏప్రిల్ లో ఎంఫిల్ పట్టా పొందాడు.

Telugu Indian Economic, Jrf, Jammu Kashmir-Inspirational Storys

కరోనా సమయంలో ఎంఫిల్ చేస్తూనే ఐఈఎస్ కోసం అహ్మద్ ఖాన్ కష్టపడి చదివాడు.తొలి ప్రయత్నంలోనే ఐఈఎస్ పరీక్షలో అహ్మద్ ఖాన్ రెండో ర్యాంక్ సాధించారు.చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టమని నాన్న ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించానని అహ్మద్ ఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.నాన్న తాను చదువుకోలేకపోయినా ఎంతో కష్టపడి నన్ను చదివించాడని అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.

Telugu Indian Economic, Jrf, Jammu Kashmir-Inspirational Storys

నాన్న శ్రమకు తగ్గ ఫలితం ఈరోజు నాకు లభించిందని అహ్మద్ ఖాన్ వెల్లడించడం గమనార్హం.ప్రణాళికాబద్ధంగా ఉండటం వల్లే మంచి ర్యాంక్స్ సాధించడం సాధ్యమైందని అహ్మద్ ఖాన్ కామెంట్లు చేశారు.తన్వీర్ కృషి, పట్టుదల, ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తన్వీర్ అహ్మద్ ఖాన్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube