భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ మరో 24 గంటల్లో గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రారంభం అవ్వనుంది.తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్, రన్న రప్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనుంది.వన్డే వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన టాప్-5 ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
కెవిన్ ఓబ్రియన్
: ఐర్లాండ్ మాజీ ఆటగాడైన కెవిన్ ఓబ్రియన్ 50 బంతుల్లో సెంచరీ చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ లో కెవిన్ ఓబ్రియన్( Kevin O’Brien ) అరుదైన ఫిట్ సాధించాడు.ఐర్లాండ్-ఇంగ్లాండ్ మ్యాచ్
లో 63 బంతులకు 13 ఫోర్లు, 6 సిక్స్ లతో 113 పరుగులు చేశాడు.
గ్లెన్ మాక్స్ వెల్:
ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.సొంత గడ్డపై జరిగిన 2015 వన్డే ప్రపంచ కప్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 51 పరుగుల్లోనే సెంచరీ చేశాడు.
ఈ మ్యాచ్లో 53 బంతులలో 10 ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 102 పరుగులు చేశాడు.

ఏబీ డివిలియర్స్:
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2015 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.ఈ మ్యాచ్ లో 66 బంతులలో 17 ఫోర్లు, ఎనిమిది సిక్స్ లతో 162 పరుగులు చేశాడు.
ఇయాన్ మోర్గాన్:
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్( Eoin Morgan ) ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.సొంత గడ్డపై 2019లో జరిగినా వన్డే ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 57 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో 71 బంతుల్లో నాలుగు ఫోర్లు, 17 సిక్స్ లతో 148 పరుగులు చేశాడు.

మాథ్యూ హేడెన్:
ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.2007 వన్డే ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో 66 బంతుల్లో సెంచరీ చేశాడు.ఈ మ్యాచ్ లో 68 బంతుల్లో 14 ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 101 పరుగులు చేశాడు.