ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటూ ఉంటారు.అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ( Positive energy ) ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో పండితులు చెబుతున్నారు.
కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఇల్లు ఎంతో ముఖ్యమైనది.మన ఇల్లు అన్ని విధాల అందంగా కనిపించాలని, ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఇంటి దిక్కు వస్తువుల స్థానం, రంగుల కలయిక ఎంతో ముఖ్యమైనవి.ఈ అంశాలు ఇంటిలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి.

అందువల్ల ఇంట్లో ఆనందం, సంపద మరియు సంతృప్తి కోసం ఇంట్లో కొన్ని ముఖ్యమైన వస్తువులను కలిగి ఉండడం ఎంతో ముఖ్యమైన నిపుణులు చెబుతున్నారు.ఇంట్లో సానుకూలత ఉంటేనే లక్ష్మీదేవి ( Goddess Lakshmi )నివసిస్తుందని కూడా చాలామంది ప్రజలు నమ్ముతారు.దీని కోసం ధ్యానం చేస్తున్న బుద్ధుని విగ్రహాన్ని( buddha statue ) ప్రవేశ ద్వారం దగ్గర ఉంచాలి.దాని నుంచి మనకు సంతోషం మరియు సానుకూల శక్తి లభిస్తుంది.
అలాగే ఇంటి ప్రాంగణంలో తులసి బృందావనం ఉండాలి.ప్రతి రోజు తులసి( Basil ) ముందు స్వస్తిక్ తీసుకొని దాని పై నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది.

ఇంటికి ఈశాన్య ( Northeast )భాగంలోని మొదటి గదిలో చేపల తొట్టిని ఉంచాలి.ఈ ట్యాంక్ లో ఐదు బంగారు చేపలను ఉంచాలి.తర్వాత ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది.అదే విధంగా గోమాతి చక్రాన్ని ఇంట్లో ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచాలి.అలా ఉంచితే ఇంట్లో ఆర్థిక సౌభాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.చాలా ఇళ్లలో మనం రాగి లేదా ఇతర లోహపు తాబేలు( Turtle ) చూస్తూ ఉంటాము.
ఈ లోహపు తాబేళ్లకు బదులుగా తాబేలు నోరు తలుపు వైపు ఉండేలా గాజు తాబేలును కలిగి ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇలా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి వస్తుంది.
అలాగే ఇంటికి గోడ పై ఉదయించే సూర్యుని చిత్రాన్ని ఉండేలా చూసుకోవాలి.