బిగ్ బాస్ అంటే ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మరి తెలుగులో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 6 సీజన్స్ ముగించుకున్న విషయం తెలిసిందే.
ఇక 7వ సీజన్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది.గత సీజన్ ప్లాప్ అవ్వడంతో ఈసారి అన్ని పగడ్బందీగా ప్లాన్ చేసి సీజన్ 7( Bigg Boss 7 ) ను సెప్టెంబర్ 3న గ్రాండ్ గా అట్టహాసంగా స్టార్ట్ చేసింది.

ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున( Nagarjuna )నే చేస్తుండగా హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కూడా చేసుకుని ఐదవ వారంలోకి అడుగు పెట్టింది.నాలుగు వారాల్లో నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ లో నుండి బయటకు వచ్చారు.ఇక ఈ వారం కూడా హౌస్ లో నామినేషన్స్ అనే రచ్చ ముగిసింది.
ఈసారి వారంలో ముగ్గురు దగ్గర పవర్ అస్త్రా( Power Astra ) ఉండడంతో వారు తప్ప మిగిలిన వారంతా నామినేషన్స్ లో ఉన్నారు.ఇక ఈ వారం ఏడుగురు సభ్యులు నామినేట్ అవ్వగా వారికీ ఓటింగ్ స్టార్ట్ అయ్యింది.
ఇదిలా ఉండగా ఈసారి బిగ్ బాస్ లో ఒక్క లవ్ స్టోరీ కూడా లేదు.రతికా నడుపుదాం అని అనుకుంది కానీ ఈమె ప్రశాంత్, యావర్ ఇద్దరికీ హ్యాండ్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు హౌస్ లో కొత్త లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. డాక్టర్, లాయర్ మధ్య ప్రేమ చిగురించినట్టే అనిపిస్తుంది.గౌతమ్, శుభ శ్రీ( Gautham Krishna,Subhashree ) మధ్య నిన్న జరిగిన సంభాషణ ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.నిన్నటి నుండి కెమెరాలన్నీ వీరిని ఫోకస్ చేస్తున్నాయి.
మొదటి వరం నుండే ఈ జంట క్లోజ్ గా కనిపిస్తున్నారు.నిన్న కూడా గుసగుసలు ఆడుతూ కనిపించారు.
నిన్న మనోడు ఏకంగా శుభ శ్రీకి హగ్ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేసాడు.మొత్తానికి ఒక కొత్త లవ్ ట్రాక్ మొదలవ్వగా ఎన్ని రోజులు వీరు అలా కంటిన్యూ అవుతారో వేచి చూడాలి.







