భోజనం తర్వాత ఈ సింపుల్ చిట్కా ను పాటిస్తే గ్యాస్ అన్న మాటే అనరు.. తెలుసా?

గ్యాస్( Acidity Problem ).దీని గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.

 Follow This Simple Remedy After Meals To Avoid Gas Problem!,simple Remedy, Gas P-TeluguStop.com

అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే జీర్ణ సమస్యల్లో గ్యాస్ ముందు వరసలో ఉంటుంది.ఎప్పుడో ఒకసారి గ్యాస్ సమస్య వస్తే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

కానీ కొందరు నిత్యం గ్యాస్ సమస్యతో బాధపడుతుంటారు.ఏదైనా ఫుడ్ తింటే చాలు పొట్ట ఉబ్బరంగా మారిపోతుంటుంది.

గుండె పట్టేసినట్లు ఉండటం, ఆయాసం, త్రేన్పులు.ఇవన్నీ గ్యాస్ లక్షణాలు.

Telugu Gas Problem, Tips, Remedy, Latest, Simple Remedy-Telugu Health

నిత్యం గ్యాస్ సమస్యతో బాధపడేవారు ఎన్నెన్నో మందులు, టానిక్ లు వాడుతుంటారు.కానీ భోజనం తర్వాత ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే గ్యాస్ అన్న మాటే అనరు.మరి ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.కీర దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

అయితే ఒక చిన్న కీర దోసకాయ( Cucumber ) తీసుకుని సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత బౌల్ తీసుకొని అందులో అర కప్పు పెరుగు వేసుకోవాలి.అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు కీర దోసకాయ తురుముతో పాటు వన్ టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీర మరియు పావు టేబుల్ స్పూన్ వాము వేసి బాగా కలపాలి.

Telugu Gas Problem, Tips, Remedy, Latest, Simple Remedy-Telugu Health

భోజనం పూర్తయిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి.ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే గ్యాస్ సమస్య మీ దరిదాపుల్లోకి కూడా రాదు.పెరుగు, కీరా దోసకాయ, కొత్తిమీర, వాము( Ajwain ). వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.ఆహారం త్వరగా జీర్ణం అవుతుం.ది గ్యాస్ సమస్య ఏర్పడకుండా ఉంటుంది.కడుపులో ఏమైనా మంట ఉన్నా దూరం అవుతుంది.కాబట్టి నిత్యం గ్యాస్ సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube