కాంగ్రెస్ భారీ స్కెచ్..119 నియోజకవర్గాల్లో నెక్స్ట్ జరిగేది ఇదేనా..?

ఓవైపు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు కలిసి ఇండియా కూటమిగా( India Alliance ) ఏర్పడ్డాయి.ఈ కూటమి ఆధ్వర్యంలో ఈసారి ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలుపొంది కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు కూటమి సభ్యులు.

 Big Sketch Of Congress Is This What Will Happen Next In 119 Constituencies Detai-TeluguStop.com

అంతేకాకుండా తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీని పడగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చూస్తోంది.ఈ తరుణంలోనే కాంగ్రెస్ దూకుడు పెంచింది.కేవలం తెలంగాణలోనే కాకుండా ఇంకా నాలుగు రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాల మీద వ్యూహాలు చేస్తూ ముందుకు వెళ్తుంది.మధ్యప్రదేశ్(Madhya Pradesh), ఛత్తీస్ ఘడ్(Chattisgadh) రాజస్థాన్(Rajasthan), మిజోరం(Mijoram), రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.

Telugu Congress, Cwc, Kharge, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi, Telanag

ఈ రాష్ట్రాల ఎన్నికలు ఒక లెక్కైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు మరో లెక్క.ఎందుకంటే తెలంగాణలో తప్పనిసరిగా అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం మొత్తం తెలంగాణపై ఫోకస్ పెట్టింది.టిపిసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16, 17వ తేదీన సిడబ్ల్యుసి మీటింగులు నిర్వహిస్తోంది.ఈ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు కాంగ్రెస్(Congress) అధినాయకులు.

Telugu Congress, Cwc, Kharge, Rahul Gandhi, Revanth Reddy, Sonia Gandhi, Telanag

అంతేకాకుండా సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడలో(Thukkuguda) నిర్వహించే భారీ బహిరంగ సభలో సోనియాగాంధీ(Sonia Gandhi) స్పీచ్ కీలకంగా మారనుంది.తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియమ్మపై తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది.ఆమె స్పీచ్ తర్వాత ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్ పై మరింత బలం పెరిగే అవకాశం కనిపిస్తోంది.ఇదే తరుణంలో తుక్కుగూడలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

ఈ మీటింగ్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంల్లో సిడబ్ల్యూసి నెంబర్లు ఆహ్వానితులు, పిసిసి చీప్ లు, సీఎల్పీ లీడర్లు పర్యటనలు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.ఖార్గే(Kharge) స్కెచ్ ప్రకారం అన్ని సక్రమంగా జరిగితే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ కు మరింత పట్టు పెరిగి రాబోవు ఎన్నికల్లో గెలుపు తీరాలకు దగ్గరగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube