మొండి మచ్చలతో బాగా విసిగిపోయారా.. ఇలా చేస్తే వారం రోజుల్లో మాయమవుతాయి!

చర్మ సౌందర్యాన్ని పాడు చేసే వాటిలో మచ్చలు ఒకటి.ముఖంపై ఏదో ఒక కారణం చేత మచ్చలు ( Spots )ఏర్పడుతూనే ఉంటాయి.

 Natural Home Remedy For Removing Stubborn Spots Home Remedy, Stubborn Spots,-TeluguStop.com

కొన్ని మచ్చలు త్వరగా తగ్గిపోయినా.కొన్ని మచ్చలు మాత్రం ఓ పట్టాన వదిలిపెట్టవు.

వీటిని మొండి మచ్చలని అంటారు.ఈ మొండి మచ్చలను నివారించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

ఖరీదైన క్రీమ్ లు వాడుతుంటారు.అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తోచక తెగ సతమతం అవుతుంటారు.

మీరు కూడా మొండి మచ్చలతో బాగా విసిగిపోయారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక వాడితే వారం రోజుల్లో మొండి మచ్చలు మాయం అవ్వడం ప్రారంభమవుతాయి. క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Blemishes, Clear Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, S

ముందుగా రెండు నిమ్మ పండ్ల‌ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి వాటికి ఉండే తొక్కను సపరేట్‌ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.అలాగే నిమ్మ తొక్కలు( Lemon Peels ) వేసి దాదాపు ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన నిమ్మ తొక్కల‌ను వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Tips, Blemishes, Clear Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, S

ఈ జ్యూస్ ను మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని వారం రోజుల పాటు వాడవచ్చు.ఇక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి,( Chandan Powder ) వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్( Mulethi Powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తో పాటు తయారు చేసి పెట్టుకున్న లెమన్ పీల్ జ్యూస్ ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం పై ఎలాంటి మొండి మ‌చ్చ‌లు ఉన్న సరే కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.

అదే సమయంలో స్కిన్ వైట్ గా బ్రైట్ గా మారుతుంది.మచ్చలేని మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

కాబట్టి మొండి మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube