టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీలో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఆయన అరెస్ట్ పై పలు విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి.
తాజాగా చంద్రబాబు అరెస్టుపై సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు స్పందించారు.చంద్రబాబు అరెస్టుతో ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.ఒక విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికమని తెలిపారు.ఏపీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయని ట్వీట్ లో వెల్లడించారు.అయితే స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో ఇవాళ ఉదయం నంద్యాలలో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.