టాలీవుడ్ పాన్ ఇండియా హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్( Prabhas )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.ఇక ప్రభాస్ నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న విషయం తెలిసిందే.ప్రభాస్ ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతాడా అని అభిమానులు ఎంతో ఆత్రు
బాహుబలి సినిమా( Baahubali ) తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత వాయిదా పడుతూనే వస్తోంది.అసలు ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించడం లేదు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ప్రభాస్ పెళ్లి విషయంలో డేటింగ్ విషయంలో కొన్ని వందల సంఖ్యలో వార్తలు వచ్చాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.అనేక రకాల రూమర్స్ కూడా వినిపించాయి.
కాజల్ అగర్వాల్,అనుష్క శెట్టి ( Anushka Shetty )ఇప్పుడు లేటెస్ట్ గా కృతి సనన్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆది పురుష్ సినిమా( Adipurush ) ముందు నుంచే ప్రభాస్ కృతి సనన్ ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇప్పటివరకు ఆ విషయంపై సరైన సమాచారం లేదు.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా హీరో ప్రభాస్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.అప్పట్లో ప్రభాస్ ఒక కుక్కని పెంచుకునేవాడట, ఆ కుక్క మీద ఆయన ఎంతో ప్రేమని పెంచుకున్నాడు.ఎంతలా అంటే ఆ కుక్కని తన సొంత కొడుకు లాగ చూసుకునేవాడట.అయితే కొంతకాలానికి ఆ కుక్క చనిపోవడంతో ప్రభాస్ ఎంతో మనస్తాపానికి గురి అయ్యాడట.
చాలా రోజులు డల్ గా ఎవరితో మాట్లాడకుండా, ఒక రూమ్ లోనే ఉండేవాడట. షూటింగ్స్ లో కూడా పాల్గొనడానికి మూడ్ లేక, చాలా రోజుల వరకు షెడ్యూల్స్ ని వాయిదా వేయించాడట.
అలా కొడుకు లాగ పెంచుకున్న కుక్క చనిపోవడం ప్రభాస్ ని ఎంతో కృంగదీసింది.అప్పటి నుండి ఆయన కుక్కల వైపు చూడడం కూడా మానేసాడట.