ఉక్రెయిన్‌లో ఆక్రమించిన ప్లేసులో ఎన్నికలు జరుపుతున్న రష్యా?

గత ఏడాదిన్నరకి పైగా ఉక్రెయిన్-రష్యా(Ukraine ) యుద్ధం జరుగుతూనే ఉంది.ఈ క్రమంలోనే రష్యా, ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది.

 Russia Is Holding Elections In The Occupied Place In Ukraine , Russia, Election-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పట్టు నిలుపుకునేందుకు అక్కడ ఎన్నికలను నిర్వహిస్తోంది రష్యా.అవును.

డోనెట్స్క్, లూహాన్స్క్( Luhansk ), ఖేర్సన్, జపొరిజ్జియా ప్రాంతాల్లో రష్యా శుక్రవారం ఎన్నికలను షురూ చేసింది.కాగా ఆదివారంతో ఇవి ముగియనున్నాయి.

ఇదిలా ఉంటే రష్యా చర్యను వెస్ట్రన్ దేశాలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి.ఏడాది క్రితం ఈ 4 ప్రాంతాలను రష్యా చేజిక్కించుకోగా ఈ ప్రాంతాలపై ఇరు దేశాలు కూడా యుద్దం చేస్తుండడం గమనార్హం.

Telugu Donetsk, Eastern, Luhansk, Nri, Occupied Place, Russia, Ukraine, Vladimir

కాగా రష్యా( Russia ) తన పట్టు నిలుపుకునేందుకు ఈ ఎన్నికలను షురూ చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని యూరప్ హక్కలు సంస్థ ఒకటి ఆక్షేపిస్తోంది.రష్యా చర్యలు ఉక్రెయిన్ ప్రజలకు ముప్పు కలిగిస్తుందని ఆ దేశం ప్రకటనలో చెప్పింది.ఈ నేపధ్యంలోనే ఈ ఎన్నికల ఫలితాలను గుర్తించవద్దని ఇతర దేశాలను కోరింది.కాగా రష్యాకు ఈ ప్రాంతాలపై పూర్తి పట్టు లేకపోయినప్పటికీ ఓటింగ్ ద్వారా భ్రమను కల్పించాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu Donetsk, Eastern, Luhansk, Nri, Occupied Place, Russia, Ukraine, Vladimir

కమ్యూనిస్ట్ పార్టీ, జాతీయవాద లిబరల్ డెమోక్రాటిక్ పార్టీలు బరిలో ఉన్నప్పటికీ రష్యా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే పుతిన్ కి చెందిన యునైటెడ్ రష్యానే ఆధిపత్యం చెలాయిస్తుందని గతంలో పుతిన్( Vladimir Putin ) ప్రసంగ రచయితగా పనిచేసిన గల్యమోవ్ చెప్పుకొచ్చారు.ఈ ప్రాంతాల్లో రష్యా భాష మాట్లాడేవారు గణనీయంగా ఉన్నారు.దీంతో ఎప్పటి నుంచో ఈ ప్రాంతాలను తనలో కలుపుకోవాలని రష్యా భావిస్తోంది.

దీనికితోడు రష్యాకు మద్దతుగా వేర్పాటువాదులు కూడా లేకపోలేదు.కాగా ఇదే విషయం ఇపుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ యుద్ధంతో ఆయా దేశాలలో ఎంతోమంది చనిపోగా మరెంతోమంది నిరాశ్రయులు అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube