ఒకప్పటి వైవాహిక సంబంధాలకి, ఇప్పటి వైవాహిక సంబంధాలకి చాలా తేడా వచ్చేసింది.ఒకప్పుడు దాదాపుగా ఆడవాళ్ళు మగడి మాటకు ఎదురు చెప్పేవారు కాదు.
భర్త అడుగుజాడల్లోనే నడుచుకునేవారు.కానీ ఇప్పుడు పరిస్తితి దానికి పూర్తిగా భిన్నంగా వుందని చెప్పుకోవచ్చు.
ఇపుడు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నారు.మరోవైపు వివాహ బంధంలో ఇబ్బందులు పడుతూ జీవించాల్సిన అవసరం లేదంటున్నాయి చట్టాలు.
దానికి తగినట్టుగానే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛకు భంగం కలగగానే, స్వేచ్ఛగా జీవించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అందుకే రకరాల కారణాలతో విడాకులు తీసుకునే వారు ఎక్కువైపోతున్నారు.దీంతో చాలా కాలంగా సమాజంలో చులకనగా ఉన్న విడాకులు అనే పదం నేడు సర్వసాధారణమైపోయిందని చెప్పుకోవచ్చు.ఇపుడు ముఖ్యంగా ఈ కారణాలతో ఎక్కువగా విడాకులు తీసుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.
అవేమిటంటే.కొంతమంది భార్యాభర్తల బంధంతో వచ్చే బాధ్యతల కారణంగా, ఒకరికొకరు సమయం ఇచ్చుకోలేకపోతున్నారు.
ఇది తరువాత తరువాత ఇద్దరి మధ్యా దూరాన్ని పెంచుతూ.కడకు విడాకుల వరకు దారితీస్తోంది.
ఇక మరోరకం చూసుకుంటే వీరు పెళ్ళికి ముందు ప్రేమ, దోమ అంటూ బాగా ఎంజాయ్ చేస్తారు.తీరా వివాహం చేసుకున్న తరువాత ఆ ప్రేమ కాస్త ముగుస్తుంది.భాగస్వామిని తేలికగా తీసుకోవడం వంటివి పరస్పర ప్రేమ, గౌరవం కోల్పోవడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.ఇలాంటి జంటలు కూడా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి.ఇక భాగస్వామిని లైంగికంగా సంతృప్తిపరచలేకపోవడం, వివాహేతర సంబంధాలు వంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చాలా జంటలు ఈ కారణాలతోనే విడాకులను కోరుతున్నాయి.
తాజా సర్వేలు అదే విషయాన్ని కనుగొన్నాయి.ఈ విషయాలపైన నిపుణులు ఏమంటున్నారంటే వైవాహిక జీవితంలో ఎదురయ్యే చాలా కష్టాలకు భార్యాభర్తలమధ్య సరైన అవగాహన లేకపోవడమే కారణం అని చెబుతున్నారు.
ఇద్దరూ కలిసి ఉండాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం, ప్రేమ, అన్నింటికంటే నమ్మకం చాలా ముఖ్యం అని అంటున్నారు.అలాంటప్పుడే విడాకుల కేసుల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.