అనుష్క ప్రమోషన్లకు రాకపోవడానికి అదే కారణం: నవీన్ పోలిశెట్టి

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అనుష్క శెట్టి( Anushka Shetty ) ఒకరు.సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి అనుష్క బాహుబలి( Bahubali )సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయారు.

 Naveen Polishetty Give Clarity About Why Anushka Not Attend Miss Shetty Mister P-TeluguStop.com

అయితే అనుష్క సినీ కెరియర్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు, ప్రయోగాత్మక చిత్రాలలో కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సైజ్ జీరో సినిమాలో బాగా శరీర బరువు పెరిగినటువంటి ఈమె అప్పటినుంచి శరీర బరువును తగ్గటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా వీలు కావడం లేదని తెలుస్తోంది.

Telugu Anushka, Baahubali, Shettymister, Tollywood-Movie

ఇక బాహుబలి సినిమా తర్వాత అనుష్క మరోసారి అధిక శరీర బరువు పెరగడంతో ఈమె పూర్తిగా తెర ముందుకు రావడానికి వెనుకడుగు వేశారు.దీంతో శరీర బరువు తగ్గడం కోసం ఇన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే నవీన్ పోలిశెట్టితో( Naveen polishetty )కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Miss Shetty Mister Polishetty )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అనుష్క ఎక్కడ కూడా ప్రమోషన్ల( Pramotions )కు హాజరు కాలేదు.

కేవలం నవీన్ మాత్రమే సినిమా ప్రమోషన్లను తన భుజాలపై వేసుకున్నారు.

Telugu Anushka, Baahubali, Shettymister, Tollywood-Movie

ఈ విధంగా అనుష్క సినిమా ప్రమోషన్లకు రాకపోవడానికి కారణం ఏంటి అనే విషయం తెలియకపోయినా ఆమె ప్రమోషన్లకు దూరంగా ఉండడంతో పలు విమర్శలు కూడా వచ్చాయి.అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నవీన్ పోలిశెట్టి అనుష్క ఎందుకు సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారనే విషయాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ అనుష్క అవుట్ ఆఫ్ ది స్టేషన్ అని తెలిపారు.

అయితే ఆమె ఒక గ్రూప్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో త్వరలోనే విడుదల చేస్తామని నవీన్ పోలిశెట్టి తెలిపారు.

అనుష్క ఇంటర్వ్యూలకు హాజరు కాకపోయినా తన వంతు తాను సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అంటూ నవీన్ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube