మిజోరంలో ఘోర ప్రమాదం జరిగింది.రైల్వే బ్రిడ్జి కూలిన ఘటనలో 17 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు.
నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిందని తెలుస్తోంది.బ్రిడ్జి శిథిలాల కింద మరికొంత మంది కార్మికులు చిక్కుకున్నారు.
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు.ఐజ్వాల్ కు సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 40 మంది కార్మికులు బ్రిడ్జి పనుల్లో పాల్గొన్నారని సమాచారం.కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.