కలెక్టర్ గారూ... మా రోడ్డుపై కరుణ చూపండి...!

సూర్యాపేట జిల్లా: మునగాల మండలం ఆకుపాముల నుండి వయా నడిగూడెం మండలం తెల్లబెల్లి మీదుగా రత్నవరం వరకు గల ఆర్ అండ్ బీ రోడ్డును మరమ్మతుల పేరుతో అధినికీకరించడానికి పనులు ప్రారంభమైనాయి.సదరు కాంట్రాక్టర్ 2023 మే 4 న రోడ్డును అక్కడక్కడ పగలదీసి మెటల్ వేశాడు.4 నెలలు కావస్తున్నా మరమ్మత్తులు, చేయడం తారుపోయడం మరిచారని స్థానికులు ఆరోపిస్తున్నారు.దీనితో కంకరపై ప్రయాణించే ద్విచక్ర వాహనాలు జారీ కిందపడి ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతున్నారని,

 Munagala Mandal People Wants Collector To Repair R And B Road, Munagala Mandal ,-TeluguStop.com

వచ్చి పోయే వాహనాలతో లేచే దుమ్ము ధూళి ఇండ్లలోకి చేరడంతో రోడ్డు ప్రక్క గ్రామాల ప్రజలు, పాదచారులు అనారోగ్యం బారిన పడుతున్నారని వాపోయారు.

అయినా సంబంధిత ఆర్ అండ్ బీ అధికారులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడలేదని, కాంట్రాక్టర్ తో పనులు చేయించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు,స్థానిక ఎమ్మెల్యే,మండల ప్రజాప్రతినిధులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్ చే రోడ్డు మరమ్మత్తులను త్వరగా పూర్తి చేయించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube