కలెక్టర్ గారూ… మా రోడ్డుపై కరుణ చూపండి…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: మునగాల మండలం ఆకుపాముల నుండి వయా నడిగూడెం మండలం తెల్లబెల్లి మీదుగా రత్నవరం వరకు గల ఆర్ అండ్ బీ రోడ్డును మరమ్మతుల పేరుతో అధినికీకరించడానికి పనులు ప్రారంభమైనాయి.
సదరు కాంట్రాక్టర్ 2023 మే 4 న రోడ్డును అక్కడక్కడ పగలదీసి మెటల్ వేశాడు.
4 నెలలు కావస్తున్నా మరమ్మత్తులు, చేయడం తారుపోయడం మరిచారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దీనితో కంకరపై ప్రయాణించే ద్విచక్ర వాహనాలు జారీ కిందపడి ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతున్నారని,
వచ్చి పోయే వాహనాలతో లేచే దుమ్ము ధూళి ఇండ్లలోకి చేరడంతో రోడ్డు ప్రక్క గ్రామాల ప్రజలు, పాదచారులు అనారోగ్యం బారిన పడుతున్నారని వాపోయారు.
అయినా సంబంధిత ఆర్ అండ్ బీ అధికారులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడలేదని, కాంట్రాక్టర్ తో పనులు చేయించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు,స్థానిక ఎమ్మెల్యే,మండల ప్రజాప్రతినిధులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్ చే రోడ్డు మరమ్మత్తులను త్వరగా పూర్తి చేయించాలని కోరుతున్నారు.
ప్రియుడి సర్‌ప్రైజ్ ప్లాన్ రివర్స్.. కేక్‌లో రింగ్ పెడితే ఇలాగే ఉంటది మరి!