తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి పదవీకాలం ముగియ బోవడం తో భూమన కరుణాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని భావించిన ప్రభుత్వo ఆయనను మరొకసారి టీటీడీ చైర్మన్ గా నియమించింది.ఇప్పటికే ఒకసారి టిటిడి చైర్మన్ గా ఒక టర్మ్ పూర్తి చేసుకున్న భూమన కరుణాకర్ రెడ్డి ( Bhumana Karunakar Reddy )టీటీడీలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టానని తన మరో దశ అధికారంతో మరిన్ని ప్రజా ఉపయోగమైన కార్యక్రమాలు చేపడతానంటూ భూమన ప్రకటించారు.
అయితే టీటీడీ చైర్మన్ పదవి అన్నది రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని ప్రభుత్వ పదవులు ఇవ్వలేని చాలామందికి టీటీడీ పదవిని ఒక రాజకీయ పునరావస పదవి గా మార్చేశారని భాజపా మండిపడుతుంది.
బాజాపా నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి( Purandheswari ) ఈ విషయంపై గట్టిగా మాట్లాడుతున్నారు.ఇంతకు ముందు కూడా 82 మంది సభ్యులతో టిటిడి పాలక మండలి ని నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసిందని దానిపై తాము గట్టిగా మాట్లాడటంతోనే 52 మంది నియమకాలను అందులో రద్దు చేశారని బజాపా చెప్తుంది .టీటీడీ చైర్మెన్ పదవి అన్నది హిందూ డర్మాన్ని కాపాడాల్సిన పవిత్ర పదవి అని రాజకీయ నివాస కేంద్రం కాదంటూ ఆమె తీవ్రంగా దుయ్యబడుతున్నారు .
తన పదవి స్వీకరించినప్పటి నుంచి వైసీపీపై దూకుడుగానే ముందుకు వెళ్తున్న బజపా అధ్యక్షురాలు టిటిడి చైర్మన్ పదవి అన్నది హిందూ ధర్మాన్ని నమ్మేవారికి హిందూ ధర్మాన్ని అనుసరించే వారికి దానిని ముందుకు తీసుకెళ్లాలనుకునే వారికి మాత్రమే ఇవ్వాలి తప్పదానిని ఒక రాజకీయ పదవిగా చూడటం సరికాదంటూ ఆమె హితవు పలుకుతున్నారు.దీనిని బాజపా చూస్తూ ఊరుకోదని హిందూ ధర్మానికి సంబంధం లేని వ్యక్తులు ముఖ్య పదవుల్లో ఉండటాన్ని బాజాపా పోరాటం చేస్తుందని కూడా ఆమె హెచ్చరిస్తున్నారు.మరి భాజపా అధ్యక్షురాలి వ్యాఖ్యలపై అధికార వైసిపి ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.ఇప్పటికే భూమన తన కుమార్తె వివాహాన్ని క్రిస్టియన్ పద్ధతిలో చేశారంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి మరి దీనిని బాజపా కనుక హైలెట్ చేస్తే ఇది జాతీయ స్థాయి విషయం గా మారే అవకాశం కనిపిస్తుంది .