క్యాండీ క్రష్ గేమ్( Candy Crush Game ) తెలియని వారు వుండరు.చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ మొబైల్ గేమ్ ని చాలా ఆసక్తిగా ఆడుతూ వుంటారు.
సమయం చిక్కినప్పుడల్లా… బస్సులోనో, కారులోనే, ట్రైన్లోనో, విమానంలోను ఇలా తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ కాస్త సమయం చిక్కినప్పుడల్లా ఆడుతూ వుంటారు.సామాన్యులకే కాదండోయ్ దీనికి సెలిబ్రిటీలు కూడా ప్రేమికులే.
ఆమధ్య క్రికెటర్ ధోని విమానంలో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కాడు.అయితే అదే రంగురంగుల క్యాండీలను దుస్తులుగా మార్చుకొని తమపై వేసుకున్న వారిని ఎప్పుడైనా చూశారా?
వినడానికి వింతగా అనిపించినా.అదే నిజం. ప్రముఖ డిజైనర్, క్రిస్టియన్ కోవన్( Designer Christian Cowan ) ఇటీవలే ‘క్యాండీ క్రష్’ బీన్‌బ్యాగ్ దుస్తులను ప్రారంభించగా.
NYC సబ్‌వే వీధుల్లో ఫంకీ వేర్‌లను ప్రదర్శించిన ఓ రిపోర్టర్.అందర్నీ ఆకర్శించింది.న్యూయార్క్ పోస్ట్ రిపోర్టర్ టేలర్ నైట్( New York Post reporter Taylor Knight ) న్యూయార్క్ నగరంలో షికారు చేయడానికి, అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇలా విచిత్రమైన వేషధారణలో కనిపించింది.ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు ఆన్‌లైన్‌లో కనిపించడంతో.
ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.టేలర్‌కు అసలు సీటు అవసరం లేదని, ఆమె ఈ దుస్తులతో సాధారణంగా నేలపై ఎలా కూర్చోవచ్చో కూడా ఈ ఫొటోల్లో చూపించడం కొసమెరుపు.
అవును, మీకు ట్రైన్లో మీరు పయనించినపుడు సీట్లు అందుబాటులో లేనప్పుడు నేలపై కూర్చోవడానికి ఉద్దేశించిన దుస్తులుగా ఇవి కనిపిస్తున్నయి.లైక్రా( Lycra )తో తయారు చేసిన ఆకట్టుకునే డిజైన్ పలువురిని ఆశ్చర్యపరిస్తే, మరింతమంది మనసుని చూరగొంటోంది.వెనిగర్, నీటి మిశ్రమాన్ని ఆ డ్రెస్ పైన ఉపయోగించినా తన పరిమాణంలో ఎలాంటి మార్పులూ రావని చెబుతున్నారు.అలాగే బీన్‌బ్యాగ్‌ల లాంటి దుస్తులు ధరించడం ఇదేం మొదటిసారి కాదు.ఇంతకుముందు, జపాన్ నుంచి ఇలాంటి ఫ్యాషన్ ట్రెండ్ వైరల్ అయింది కూడా.మరెందుకాలస్యం… ఇపుడు ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మరి.