కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్( Anirud Ravichandran ) అతను ఇచ్చే మ్యూజిక్ తో సూపర్ అనిపించుకుంటాడు.అతను ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే సినిమాలో మ్యూజిక్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా స్టార్ సినిమాలకు అనిరుద్ మ్యూజిక్ వేరే లెవెల్ అనేలా ఉంటుంది.లేటెస్ట్ గా జైలర్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది.
ముఖ్యంగా రజిని( Rajnikanth ) సినిమా కు అనిరుద్ ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశాడు.తలైవా సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో బాగా తెలిసిన అనిరుద్ ఆ లెక్క సరి చేశాడు.
అయితే అనిరుద్ మీద కంప్లైంట్ కూడా ఉంది.అతను డేట్స్ విషయంలో క్లాషెష్ ఇంకా అనుకున్న టైం కి అవుట్ పుట్ ఇవ్వడు అని అంటుంటారు.తన పనితనం లేట్ అయినా సరే వర్క్ విషయంలో అతని అవుట్ పుట్ ని వంక పెట్టేలా ఉండదు.అదే అనిరుద్ ని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగేలా చేస్తుంది.
జైలర్( Jailer Movie ) సినిమాలో నెల్సన్ డైరెక్షన్ టాలెంట్ కి అనిరుద్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.ప్రస్తుతం తెలుగులో దేవర సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఆ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.