తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) వైఖరి ఏమిటనేది తెలియక వామపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.బీఆర్ఎస్ తోనే కలిసి ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే సిపిఐ, సీపీఎం ప్రకటించింది.
బీఆర్ఎస్ కూడా వామపక్ష పార్టీలను కలుపుకుని ఎన్నికలకు వెళ్తామని చెబుతోంది.అయితే పొత్తుల విషయంలో మాత్రం స్పందన లేనట్టుగా వ్యవహరిస్తుండడంతో , బీఆర్ఎస్, సిపిఎం పార్టీల నేతల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.
మరో వైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలకు కేవలం మూడు నెలలు మాత్రమే సమయం ఉంది.ఆయా పార్టీల క్యాడర్ సైతం ఈ విషయంలో గందరగోళంగా ఉన్నాయి.
ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అని అనుమానం కూడా బీఆర్ఎస్ అగ్ర నేతల్లో ఉంది.పొత్తుల్లో భాగంగా వామపక్ష పార్టీలకు సీట్లు కేటాయిస్తే గెలిచే సీట్లను కోల్పోతామేమో అన్న ఆందోళన సైతం బీ ఆర్ ఎస్ అధిష్టానం ల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు తర్వాత కమ్యూనిస్టు పార్టీ నేతలు కేసీఆర్( KCR ) ను కలిసేందుకు ప్రయత్నించినా, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ( Assembly elections )కొన్ని సీట్ల కేటాయించాలని కెసిఆర్ పై వామపక్ష పార్టీల నేతలు ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.అయితే కామ్రేడ్లతో కెసిఆర్ భేటీ కాకపోవడంతో దీనిపై ఏ క్లారిటీ రావడం లేదు.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో బీ ఆర్ ఎస్ పార్టీకి వామపక్ష పార్టీలు మద్దతు పలికాయి.
అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.ఇదేవిధంగా వచ్చే ఎన్నికల్లోను వామపక్ష పార్టీలతో కలిసి వెళ్తామని కేసీఆర్ సైతం ప్రకటించారు.
అయితే వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ ఓటు బ్యాంకు బీ ఆర్ ఎస్ కు బదిలీ అవుతుందా లేదా అనేది కేసీఆర్ కు అనుమానంగానే ఉంది.
బీఆర్ఎస్ గెలిచే సీట్లను వామపక్ష పార్టీలకు కేటాయిస్తే .అక్కడ ఆ పార్టీ నేతలు ఓడిపోతే అది కాంగ్రెస్ , బిజెపిలకు( Congress , BJP ) కలిసి వస్తాయని ఆందోళన ఉంది.అందుకే పొత్తులపై కేసీఆర్ ఇంకా ఏ క్లారిటీ ఇవ్వడం లేదట.
అయితే కొత్తగూడెం , మునుగోడు, హుస్నాబాద్ సీట్లు తమకు కేటాయించాలని సీపీఐ, వైరా, మిర్యాలగూడ తో పాటు మునుగోడు నియోజకవర్గం కేటాయించాలని సిపిఎం( CPM ) కోరుతోంది.అయితే వామపక్ష పార్టీలతో పొత్తు విషయంలో ఏం చేయాలనిది తెలియక బీఆర్ఎస్ అధిష్టానం సైతం ఆలోచనలో పడింది.