సినిమా ఇండస్ట్రీలో మామూలుగా హీరోలు రీమేక్ సినిమాలు చేస్తూ ఉంటారు.ఒక్క తెలుగు ఇండస్ట్రీ( Telugu Industry )లో మాత్రమే కాకుండా అన్ని ఇండస్ట్రీలో హీరోలు రీమేక్ సినిమాలు చేయడం అన్నది కామన్.
అలా టాలీవుడ్ లో చిరంజీవి,పవన్ కళ్యాణ్, ప్రభాస్ రామ్ చరణ్ ఇలా ఎంతోమంది హీరోలు రీమేక్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే.అందులో కొన్ని సినిమాలు సక్సెస్ కాగా మరి కొన్ని డిజాస్టర్ లుగా నిలిచాయి.
అయితే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక హీరో మాత్రం ఒక రీమేక్ సినిమా( Remake Movies ) కూడా చేయలేదు.అలా అని ఆ హీరో కొత్తగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అనుకుంటే పొరపాటు పడినట్లే.
ఎందుకంటే ఆ హీరో సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి దాదాపు 23 ఏళ్లు పూర్తి అయింది.అయినా కూడా ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించలేదు.ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ).ఆయన తన సినీ కెరీర్లో ఒక్క రీమేక్ చిత్రంలో కూడా నటించలేదు.ఈ విషయం చాలామంది ఫ్యాన్స్‌కి తెలిసే ఉంటుంది.కానీ మహేష్ రీమేక్ సినిమాలు చేయకపోవడం వెనుక అసలు కారణం ఏంటన్నది మాత్రం చాలామందికి తెలియదు.
మరి మహేష్ బాబు రీమేక్ సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మొదట రాజకుమారుడు సినిమా( Rajakumarudu )తో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు మహేష్ బాబు.ఇకపోతే రీమేక్ సినిమా( Movie Remakes ) చేయకపోవడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని వస్తే.అప్పటికే విడుదల అయిన ఒక సినిమా చూసి, తర్వాత సెట్స్‌పైకి వెళ్తే అందులో ఆ హీరోనే కనిపిస్తాడు.అంతేకాదు ఆ హీరోలా చేయాలా? లేదా మనలా యాక్టింగ్, మ్యానరిజమ్స్ చేయాలా అనే కన్ఫ్యూజన్లో పడిపోతాను.అందుకే చాలావరకు రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటానని మహేష్ బాబు తెలిపారు.అయితే తాను రీమేక్‌లు చేయనని కానీ తన సినిమాలు వేరే హీరోలు రీమేక్ చేయాలని అనుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు.