జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరి కాసేపటిలో విశాఖలోని రుషికొండకు వెళ్లనున్నారు.ఈ క్రమంలోనే రుషికొండ నుంచి ఎర్రమట్టి దిబ్బలకు ఆయన వెళ్లనున్నారని తెలుస్తోంది.
అయితే ఎర్రమట్టి దిబ్బల సందర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు.కాగా సెక్షన్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెబుతున్నారు.
అయితే అధికారులు అనుమతి ఇవ్వకపోయినా రుషికొండకు, అక్కడ నుంచి ఎర్రమట్టి దిబ్బలకు వెళ్లి తీరుతామని పవన్ చెబుతున్నారని సమాచారం.గతంలోనూ పోలీసుల అనుమతి లేకుండా పవన్ రుషికొండను సందర్శించిన సంగతి తెలిసిందే .అదే తరహాలో ఇవాళ కూడా పవన్ పర్యటన కొనసాగనుందని సమాచారం.