ఈ ఉపయోగాల గురించి వింటే క్రెడిట్‌ కార్డు కావాలంటారు?

అత్యవసర పరిస్థితులలో ఆర్ధిక అవసరాలు తీర్చడానికి క్రెడిట్ కార్డులు చాలా మందికి రోజువారీ జీవితంలో ఒక సాధనంగా ఉపయోగపడుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.కిరాణా దుకాణాల్లో సాధారణ కొనుగోళ్లు నుండి అనేక రకాల ఆర్థిక లావాదేవీలకు ఇపుడు చాలామంది ఉద్యోగులు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.

 Interesting Facts About Credit Card Benefits,credit Cards,credit Card Usage,cred-TeluguStop.com

అంతేకాకుండా అదనపు ఆఫర్‌లు, తగ్గింపులు అనేవి చాలా మంది వినియోగదారులను క్రెడిట్ కార్డులు( Credit Cards ) వాడేలా ప్రోత్సహిస్తూ ఉంటాయి.అయితే ఏది ఏమైనా అప్పు అప్పే అని భావించేవారు కొంతమంది వీటిని వాడడానికి వెనుకంజ వేస్తూ వుంటారు.

అంతగా ఇంట్రెస్ట్ చూపరు.

Telugu Credit Benefits, Credit, Credit Usage, Credit Cards, Retail Websites-Late

అయితే క్రెడిట్ కార్డ్స్ ఉపయోగం తెలిస్తే గనుక మీరు తీసుకోకుండా ఉండలేరు.క్రెడిట్ కార్డులు అనేవి ముందుగా నిర్ణయించిన పరిమితితో మీకు లభిస్తాయి.చాలా క్రెడిట్ కార్డులు 30 రోజుల ఉచిత రీపేమెంట్ ( Free Repayment )వ్యవధితో వస్తాయి.

ఈలోపు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా చెల్లింపులు చేయవచ్చు.అవసరమైనపుడు మీరు ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించకుండా ఉండటానికి సమానమైన నెలవారీ వాయిదాలలో (ఈఎంఐ) మీ కొనుగోలును చెల్లించడాన్ని దీనిద్వారా ఎంచుకోవచ్చు.

వ్యక్తిగత రుణాన్ని పొందడం కంటే కూడా క్రెడిట్ కార్డు ద్వారా ఋణం పొందడం చాలా ఉపయోగకరం.ఇక చాలా క్రెడిట్ కార్డ్‌లు స్వైప్ చేసిన ప్రతిసారీ క్యాష్‌బ్యాక్( Cashback ) నుంచి రివార్డ్ పాయింట్‌ల వరకు అనేక లాభదాయకమైన వెసులుబాటుని కలిగి ఉంటాయి.

Telugu Credit Benefits, Credit, Credit Usage, Credit Cards, Retail Websites-Late

ఇక కస్టమర్ క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేస్తే గనుక అనేక ఆన్‌లైన్ రిటైల్ వెబ్‌సైట్‌లు( Online Retail Websites ) అదనపు తగ్గింపులను అందిస్తాయి.భవిష్యత్‌లో మీరు ఏకమొత్తంలో రుణం తీసుకోవాల్సి వస్తే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.చాలా బ్యాంకులు ట్రావెల్ క్రెడిట్ కార్డులను కూడా జారీ చేస్తాయి.ఇవి విమాన టిక్కెట్లు లేదా హోటల్ వసతిపై లాభదాయకమైన తగ్గింపులను కలిగి ఉంటాయి.అంతేకాకుండా అవి సున్నా విదేశీ లావాదేవీల రుసుముతో వస్తాయి.చాలా సందర్భాల్లో ప్రయాణంలో ప్రమాదాలు, పోయిన లగేజీకి కూడా బీమా కవరేజీ ఉంటుంది.

కొన్ని మార్గాల్లో నెలవారీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌( Credit Card Statements )లు మన ఖర్చుల వివరాలను అందిస్తాయి.ఇలా ఇంకా అనేక రకాల ఉపయోగాలు క్రెడిట్ కార్డుల వలన మీకు ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube