తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోసిల్ మీడియా లో వైరల్ అవుతోంది.మన భల్లాలదేవుడు రానాకు, సూపర్ స్టార్ మహేష్ బాబుకు( Mahesh babu ) మధ్య చాలా కలం క్రితం ఒక మాటల యుద్ధ జరిగిందని…వీళ్లిద్దరు ఆ గొడవను ఇంకా మర్చిపోలేదని, బయట కలిసినప్పుడు మాట వరసకు హాయ్… బాయ్… అనుకుంటారు తప్ప, నిజానికి వీళిద్దరికి అస్సలు పడదని గుసగుసలు వినిపిస్తున్నాయి.అసలు వీళిద్దరి మధ్య జరిగిన గొడవకు కారణం ఏమిటి? ఆ సంగతులు ఇప్పుడు చూద్దాం…
వైజయంతి మూవీస్ బ్యానర్ పై 2006 లో మహేష్ బాబు హీరోగా, గుణ శేఖర్ దర్శకత్వం లో వచ్చిన చిత్రం సైనికుడు. త్రిష( Trisha Krishnan ) హీరోయిన్.బాలీవుడ్ స్టార్ ఇర్ఫాన్ ఖాన్ తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇది.ఒక్కడు వంటి బ్లాక్బస్టర్ సినిమా తరువాత మహేష్ బాబు, గుణ శేఖర్ కంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం సైనికుడు.భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అనుకున్న విజయం సాధించలేదు.ఐతే ఈ సినిమాకు రానా వీఎఫ్ఎక్స్ డెసైనెర్ గా పనిచేసాడు.నటుడిగా సినిమాలలో అడుగు పుట్టకముందు రానా ఒక వీఎఫ్ఎక్స్ స్టూడియో రన్ చేశారన్న విషయం మనందరికీ తెలిసినదే.
ఐతే ఈ సినిమా విడుదలైన కొన్నాళ్ళకు మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..సైనికుడు ( Sainikudu )ప్లాప్ అవ్వటానికి కారణం వీఎఫ్ఎక్స్ బాగోలేకపోవడమే అని….దీనికి కారణం రానా అని అన్నారట.అంతటితో ఆగకుండా ఈ సినిమాను శేఖర్ కముల ఐతే ఇంకా బాగా తీస్తారని సెటైర్ వేసారట.మహేష్ చేసిన ఈ కామెంట్ తో వీళ్లిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయట.కొన్నాళ్ల తరువాత మరో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, రానా( Rana ) మన ఇండస్ట్రీలో చెయ్యాల్సిన కొన్ని మార్పులు గురించి తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చాడు.
టాలీవుడ్ టెక్నిషన్స్ సింక్ సౌండ్ టెక్నిక్స్ నేర్చుకోవాలని, దుబ్బింగ్ సిస్టం తీసేయాలని, అన్నింటికంటే ముందు మనం తెలుగు నేర్పే కోచ్ ను పెట్టుకోవాలని వెటకారంగా మాట్లాడారు రానా.ఇలా వీళ్లిద్దరి మధ్య ఒక చిన్నపాటి మాటల యుద్ధమే జరిగిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.